సీనియర్ నటి షకిలా అస్తమయం

Published : Sep 22, 2017, 05:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
సీనియర్ నటి షకిలా అస్తమయం

సారాంశం

బాలీవుడ్ సీనియర్ నటీమణి షకిలా(82) కన్నుమూత రాజ్‌కపూర్‌, షమ్మీ కపూర్‌, గురుదత్‌ లాంటి బాలీవుడ్‌లో అగ్ర నటించిన షకిలా షకిలా గుండెపోటుతో తుది శ్వాస విడిచారని తెలిపిన ఆమె కుటుంబ సభ్యులు

బాలీవుడ్ సీనియర్‌ నటి షకీలా కన్నుమూశారు. బుధవారం (సెప్టెంబర్ 20) ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమె వయసు 82 ఏళ్లు. ముంబైలోని మహిమ్ శ్మశానవాటికలో గురువారం ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. రాజ్‌కపూర్‌, షమ్మీ కపూర్‌, గురుదత్‌ లాంటి బాలీవుడ్‌లో అగ్ర హీరోలతో ఆమె నటించారు. ‘బాబూజీ ధీరే చల్నా...’, ‘బార్‌ బార్‌ దేఖో.. హజార్‌ బార్‌ దేఖో..’ లాంటి పాటలతో ఆమె సినీ ప్రియులను ఆకట్టుకున్నారు.
 

1950లలో వచ్చిన గురుదత్‌ క్లాసిక్‌ సినిమాలు.. ఆర్‌పార్‌, సీఐడీలతో పాటు చైనా టౌన్‌, ఆలీ బాబా ఔర్‌ చాలీస్‌ చోర్‌, పోస్ట్‌ బాక్స్‌ 999 లాంటి మూవీల్లో షకీలా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.
 

నటి నాజిర్‌ ఖాన్‌ షకిలాకు సమీప బంధువు. ఆమె ఫేస్‌బుక్‌‌లో చేసిన పోస్టు ద్వారా షకిలా మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె మృతిపై పలువురు బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు, నటీనటులు సంతాపం తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి