RRR: పలుకే బంగారమాయెనా?

Published : Feb 18, 2019, 07:57 PM IST
RRR: పలుకే బంగారమాయెనా?

సారాంశం

బాహుబలిని మించిన బడ్జెట్ లో రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి దర్శకుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ RRR ప్రాజెక్ట్ కి సంబంచిన అసలైన విషయాలు కొంచెం కూడా తెలియలేదు. ఏవో రూమర్స్ వస్తున్నా వాటిపై కూడా జక్కన్న అసలు స్పందించడం లేదు. 

జనాల్లోకి వచ్చినా కూడా ఎవరైనా అడిగితే మొహం చాటేసే రాజమౌళి మొదటి సారి ఉహించనివిధంగా RRRపై రెండు ముక్కలు మాట్లాడాడు. అయితే అందులో సినిమా కథకు సంబందించిన విషయం గాని నటీనటుల గురించి గాని ఎలాంటి ]పాయింట్స్ లేవు.  రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్న జక్కన్న.. RRR ఇండియలోనే లార్జ్ స్కెల్ కలిగిన సినిమా అని చెప్పాడు. 

అదే విధంగా ఇదొక పాన్ ఇండియన్ ఫిల్మ్ అంటూ బాహుబలి రేంజ్ లో పొగిడాడు. ఇంకా ఏం చెబుతారో అని ఎదురుచూసిన జనాలకు అంతకంటే ఎక్కువ మ్యాటర్ దొరకలేదు. కొంత మంది రిక్వెస్ చేసినప్పటికీ ఎక్కడికెళ్లినా జక్కన్న అసలు RRR గురించి ఏ మాత్రం మాట్లాడటం లేదు. దీంతో పలుకే బంగార మాయెనా.. అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.  'RRR సినిమా రెంజ్ అంచనాలకు అందకుండా ఉండాలంటే కొన్ని రోజుల వరకు మాట్లాడకుండా ఉంటేనే బెటర్' అని అనుకుంటున్నాడో ఏమో మరి.  

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్