సైనిక కుటుంబాలకు స్టార్ హీరోల భారీ విరాళం

Published : Feb 18, 2019, 06:22 PM IST
సైనిక కుటుంబాలకు స్టార్ హీరోల భారీ విరాళం

సారాంశం

  పుల్వామా ఘటనలో ప్రాణాలు విడిచిన జవానుల కోసం దేశం మొత్తం ఏకమయ్యింది. వారి కుటుంబాలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది.  సెలబ్రెటీలు కూడా చాలా వరకు ఈ విషయంపై స్పందిస్తూ ఉగ్ర దాడిపై ప్రతీకారం తీర్చుకోవాలని చెబుతున్నారు.

 

పుల్వామా ఘటనలో ప్రాణాలు విడిచిన జవానుల కోసం దేశం మొత్తం ఏకమయ్యింది. వారి కుటుంబాలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది.  సెలబ్రెటీలు కూడా చాలా వరకు ఈ విషయంపై స్పందిస్తూ ఉగ్ర దాడిపై ప్రతీకారం తీర్చుకోవాలని చెబుతున్నారు. అదే విధంగా జవానులు కుటుంబాలను ఆదుకోవడానికి ఈ సమయం చాలా ముఖ్యమైనది అంటూ నెటిజన్స్ కి పిలుపునిస్తున్నారు. 

ఇలాంటి విషయాల్లో ముందుండే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. అయన 5 కోట్ల వరకు జవానుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నట్లు ఒక జాతియా మీడియా పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో పుల్వామా ఘటనపై అక్షయ్ ప్రతి రోజు ఎదో ఒక విధంగా స్పందిస్తున్నాడు. 

ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తన ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మరణించిన జవానుల ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున 2.5కోట్ల చొప్పున ప్రకటించి మిగతావారిని ఉత్సాహపరిచారు. వీరిని చూసి ప్రస్తుతం పలువురు బాలీవుడ్ నటీనటులు వారికి తోచినంత ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సిద్దపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Rachita Ram: బాడీ షేమింగ్ కామెంట్స్ పై కూలీ నటి స్ట్రాంగ్ రియాక్షన్, అలాంటి వాళ్ళు నిజంగా మూర్ఖులే
Malavika Mohanan: డైలాగ్స్ చెప్పమంటే ఏబీసీడీలు చదువుతారు.. హీరోయిన్లపై రాజాసాబ్ బ్యూటీ కామెంట్స్