హలో పిల్ల ఆగట్లేదుగా.. అఖిల్ కంటే స్పీడ్!

Published : Feb 18, 2019, 06:53 PM IST
హలో పిల్ల ఆగట్లేదుగా.. అఖిల్ కంటే స్పీడ్!

సారాంశం

హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ గ్యాప్ లేకుండా సినిమాలను ఒకే చేస్తోంది. మొదటి సినిమా హలో అనుకున్నంతగా విజయం సాధించకపోవడంతో అమ్మడు అసలు క్లిక్ అవుతుందా అని కొన్ని ఊహాగానాలు కూడా వచ్చాయి. 

హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ గ్యాప్ లేకుండా సినిమాలను ఒకే చేస్తోంది. మొదటి సినిమా హలో అనుకున్నంతగా విజయం సాధించకపోవడంతో అమ్మడు అసలు క్లిక్ అవుతుందా అని కొన్ని ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే హీరో అఖిల్ కంటే ఈ బ్యూటీ చాలా స్పీడ్ గా కథలను ఎంచుకుంటూ బిజీగా మారుతోంది. 

హలో సినిమాలో ఆమె నటన అందం నిర్మాతలను దర్శకులను ఎక్కువగా ఆకర్షించాయట. తండ్రి సీనియర్ దర్శకుడైన ప్రియదర్శన్ తన కూతురు తప్పకుండా త్వరలోనే బిజీ అవుతుందని చెప్పిన మాట నిజమవుతోంది. తెలుగులో ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో చిత్రలహరి అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. నేను శైలజా దర్శకుడు కిషోర్ తిరుమల ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇక త్వరలో స్టార్ట్ కానున్న శివకార్తికేయన్ తమిళ్ సినిమాలో కూడా బేబీ సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు అభిమన్యుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న PS.మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.  మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించబోయే కొత్త సినిమాలో కూడా కళ్యాణి కనిపించనుంది. అదే విధంగా తండ్రి ప్రియదర్శన్ తీయబోయే ఒక ద్విభాషా చిత్రంలో కూడా కళ్యాణి నటించడానికి రెడీ అవుతోంది. మొత్తంగా ఒకే ఒక్క సినిమాతో అమ్మడు 5 సినిమాలను లైన్ లో పెట్టినట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్