RRR movie prerelease event : ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా... దుబాయిలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న జక్కన్న!

Published : Oct 27, 2021, 01:22 PM IST
RRR movie prerelease event : ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా... దుబాయిలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న జక్కన్న!

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ వేడుక దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారట. సినిమాలో ప్రధాన పాత్రలు చేసిన నటులతో పాటు సాంకేతిక నిపుణులు పాల్గొనే RRR pre release ఈవెంట్ అబ్బురపరిచేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారన్న మాట వినిపిస్తుంది.

ఏళ్ల తరబడి ప్రేక్షకుల నిరీక్షణకు మరో రెండు నెలలో తెరపడనుంది. జక్కన్న ఇద్దరు టాప్ స్టార్స్ తో చెక్కిన వెండితెర అద్భుతం ఆర్ ఆర్ ఆర్ 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పలు కారణాల చేత RRR movie షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దీంతో ఆర్ ఆర్ ఆర్ విడుదల మూడుసార్లు వాయిదా పడింది. ఆలస్యమైనా రాజమౌళి ఇచ్చే ఆ గూస్ బంప్స్ ఎక్సపీరియెన్స్ పొందాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 


భీమ్ గా Ntr, అల్లూరిగా రామ్ చరణ్ లుక్స్, క్యారెక్టరైజేషన్స్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చాయి. ఒకరిమించి మరొకరి ఫస్ట్ లుక్ వీడియో ఉంది. నిమిషాల నిడివి కలిగిన వీడియోలలో ఎన్టీఆర్, Ram charan పాత్రలు ఎంత ఫెరోషియస్ గా ఉంటాయో రాజమౌళి పరిచయం చేశారు. కాగా మూవీ విడుదల దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ పై రాజమౌళి దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మూవీ నుండి సాంగ్స్, టీజర్స్ విడుదల చేయనున్నారు. 


అన్నిటికీ మించి ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ వేడుక దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారట. సినిమాలో ప్రధాన పాత్రలు చేసిన నటులతో పాటు సాంకేతిక నిపుణులు పాల్గొనే RRR pre release ఈవెంట్ అబ్బురపరిచేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారన్న మాట వినిపిస్తుంది. దుబాయ్ లాంటి ఇంటర్నేషనల్ లో సిటీలో ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ వేడుక జరపడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్శించాలని చూస్తున్నారట. అలాగే తెలుగువాళ్లు అధికంగా ఉండే Dubai లో ఈవెంట్ టికెట్స్ ద్వారా కూడా కొంత ఆదాయం రాబట్టనేది జక్కన్న ఆలోచనగా తెలుస్తుంది. 

Also read Katrina kaif: డిసెంబర్ లో విక్కీ-కత్రినా వివాహం... విశ్వసనీయవర్గాల సమాచారం ఏంటంటే
గతంలో ఇండియా నుండి రజినీకాంత్ రోబో లాంటి చిత్రాలు తమ ప్రీ రిలీజ్ వేడుకను దుబాయిలో జరుపుకున్నాయి. అదే స్ట్రాటజీని జక్కన్న ఆర్ ఆర్ ఆర్ కోసం ఉపయోగించనున్నారట. మరి దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది. డివివి దానయ్య దాదాపు రూ. 400కోట్ల  బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తున్న ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 
Also read ఇలియానా బికినీ ట్రీట్‌.. సెల్ఫీలో క్లోజ్‌గా అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న `పోకిరి` భామ..

PREV
click me!

Recommended Stories

పూలచీరలు కట్టిన ప్రియాంక చోప్రా
Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?