ఆ పిల్ల బాత్రూమ్ లో నేనెందుకుఉంటాను రా... : ప్రభాస్

By Surya Prakash  |  First Published Oct 27, 2021, 10:07 AM IST

దానికి వెంటనే ప్రబాస్ రెస్పాండ్ అవుతూ...ఆ పిల్ల బాత్రూమ్ లో నేను ఎందుకు ఉంటారునా అన్నారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.   మీరూ ఈ వీడియోని ఇక్కడ చూడవచ్చు.
 


ఆకాష్‌ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్‌ పాదూరి దర్శకత్వంలో పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో వాస్కో పాత్రలో ఆకాష్, మౌనిక పాత్రలో కేతిక నటించారు.  రీసెంట్ గా హీరో ప్రభాస్‌ ‘రొమాంటిక్‌’ ట్రైలర్‌ను విడుదల చేసిన వీడియోను ప్లే చేశారు. ట్రైలర్ బాగా క్లిక్ అయ్యింది. ఇప్పుడు హీరో,హీరోయిన్స్ ఇద్దరినీ కూర్చోబెట్టి ఇంటర్వూ లాంటి ఫన్నీ చిట్ చాట్ చేసారు. అందులో ప్రభాస్ సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి.

మొదట ఆమె తనను తాను పరిచయం చేసుకుంటూ హాయ్ సార్ ఐయామ్ ఫ్రమ్ కేతిక ఫ్రమ్ న్యూడిల్లీ అనగానే, ఐయామ్ ప్రభాస్ ఫ్రమ్ మొగల్తూర్ అన్నారు. మీరు బాహుబలి, యూనివర్శల్ స్టార్ అంటూ చెప్పుకొచ్చింది. గోవాతనకు ఇష్టం అని తను ఫుడ్ లవర్ అని చెప్పారు ప్రభాస్.  ఆ తర్వాత సినిమా రిలీజ్ అవ్వకముందే ఇన్ని డ్రామాలు ఆడుతూంటే..రేపు సినిమా సూపర్ హిట్ అయ్యాక ఎలా ఉంటారో అంటూ సెటైర్ వేసారు.

Latest Videos

undefined

Also read సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్

ముఖ్యంగా కేతికను ఓ సాంగ్ పాడమని అడిగారు. అయితే ఆమె నేను బాత్రూమ్ సింగర్ ని అని చెప్పింది. దానికి ఆకాష్ రిప్లై ఇస్తూ ..ఇదే నీ బాత్రూమ్ అనుకుని పాడేయ్ అన్నారు ఆకాష్. ఆ తర్వాత ఇదే బాత్రూమ్ అనుకుని పాడేయ్, డార్లింగ్ కూడా లేరు అనుకో అన్నారు. దానికి వెంటనే ప్రబాస్ రెస్పాండ్ అవుతూ...ఆ పిల్ల బాత్రూమ్ లో నేను ఎందుకు ఉంటారునా అన్నారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.   మీరూ ఈ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

ఇక ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే అందించిన పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్‌’ను విడుదల చేస్తున్నామని తెలియగానే ఈ సినిమా గురించి ప్రభాస్‌ ఫోన్‌ చేసి పదే పదే అడిగారు. సినిమా గురించి ట్వీట్‌ వేయాలా? ఈవెంట్‌కు రావాలా? అని అడిగారు. ప్రభాస్‌ చాలా మంచివారు. ‘రొమాంటిక్‌’ సినిమా సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ‘డార్లింగ్‌..’ అంటూ సాగే ఓ స్పెషల్‌ సాంగ్‌ సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతోంది. ఆకాష్, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. గ్రాఫిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చినా అనిల్‌ ‘రొమాంటిక్‌’ను బాగా తెరకెక్కించాడు’’ అన్నారు చార్మి. 

click me!