Pushpa story: పుష్ప కథ కాపీనా.. ఆ వెబ్ సిరీస్ గురించే డిస్కషన్ ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 22, 2021, 01:08 PM ISTUpdated : Dec 22, 2021, 01:10 PM IST
Pushpa story:  పుష్ప కథ కాపీనా.. ఆ వెబ్ సిరీస్ గురించే డిస్కషన్ ?

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తోంది. విభిన్నమైన చిత్రాలతో సుకుమార్ ప్రేక్షకులని థ్రిల్ చేస్తారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తోంది. విభిన్నమైన చిత్రాలతో సుకుమార్ ప్రేక్షకులని థ్రిల్ చేస్తారు. ఈ చిత్రంలో సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు. అల్లు అర్జున్ ని విభిన్నమైన గెటప్ లో ప్రజెంట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారు. 

అల్లు అర్జున్  నటనతో అదరగొట్టాడు. రష్మిక అందాలు, సమంత ఐటెం సాంగ్ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎప్పుడూ విభిన్నమైన కథలు ఎంచుకుంటారు. ఆయన చిత్రాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అవి మూసధోరణిలో ఉండవు. అందుకే సుకుమార్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. 

ఇదిలా ఉండగా పుష్ప చిత్రానికి వసూళ్లు వస్తున్నప్పటికీ.. ఆ చిత్రం పూర్తిస్థాయిలో అలరించే విధంగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ మార్క్ పూర్తిగా మిస్ అయింది. ఇక తాజాగా ఈ చిత్రంపై సోషల్ మీడియాలో మరో ఆరోపణ కూడా వినిపిస్తోంది. 

ఈ చిత్ర కథ కాపీ అంటూ నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. సుకుమార్ ఈ చిత్రాన్ని ఫేమస్ వెబ్ సిరీస్ 'నార్కోస్' ఆధారంగా రూపొందించారని నెటిజన్లు అంటున్నారు. పుష్పలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్.. నార్కోస్ లో హీరో పాత్రని పోలినట్లు ఉందని అంటున్నారు. అలాగే కొండారెడ్డి బ్రదర్స్ పాత్రలు కూడా నార్కోస్ లో స్పష్టంగా కనిపిస్తాయి. తప్పకుండా సుకుమార్ నార్కోస్ నుంచి స్ఫూర్తి పొందే పుష్ప కథ రూపిందించి ఉంటారనేది నెటిజన్ల ఆరోపణ. నార్కోస్ లో ఉన్న డ్రగ్స్ మాఫియాని సుకుమార్ పుష్పాలో ఎర్రచందనం స్మగ్లింగ్ గా మార్చారు అని అంటున్నారు. 

నాన్నకు ప్రేమతో, రంగస్థలం, 1 నేనొక్కడినే ఇలా సుకుమార్ చిత్రాలన్నీ వేటికవే భిన్నంగా ఉంటాయి. కానీ పుష్ప చిత్రంపై కాపీ ఆరోపణలు రావడం బన్నీ, సుకుమార్ ఫ్యాన్స్ ని అప్సెట్ చేసే అంశమే. 

Also Read: Pushpa : అప్పుడే 2003 కోట్లు వచ్చాయా పుష్పా,ట్రోలింగ్

Also Read: Malaika Arora: మలైకా మరీ టూ మచ్ .. అతిగా అందాల ఆరబోత, ఇంటర్నెట్ లో బ్లాస్టింగ్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..