RRR glimpse: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, అజయ్‌ దేవగన్, అలియాలతో వర్క్ చేయడంపై రాజమౌళి హాట్‌ కామెంట్‌

Published : Nov 01, 2021, 09:52 PM IST
RRR glimpse: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, అజయ్‌ దేవగన్, అలియాలతో వర్క్ చేయడంపై రాజమౌళి హాట్‌ కామెంట్‌

సారాంశం

`ఆర్‌ఆర్ఆర్‌` సినిమాకి సంబంధించి దర్శకుడు రాజమౌళి హాట్‌ కామెంట్స్ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అజయ్‌ దేవగన్‌, అలియాభట్‌, శ్రియా వంటి వారితో పనిచేయడంపై ఆయన స్పందించారు. 

ఇండియన్‌ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie). ఎన్టీఆర్‌(Ntr), రామ్‌చరణ్‌(Ram Charan) హీరోలుగా, అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ కథానాయికలుగా, అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రధారులుగా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్(RRR Glimpse) ని సోమవారం విడుదల చేశారు. ఇండియన్‌ సినిమా కీర్తిపతాక ఎగరేసే విధంగా ఈ సినిమా ఉండబోతుందని ఈ గ్లింప్స్ ద్వారా తెలియజేశారు రాజమౌళి(Rajamouli). ప్రస్తుతం ఈ గ్లింప్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతుంది. 

ఆరు మిలియన్స్ వ్యూస్‌ దాటి దూసుకుపోతుంది RRR glimpse. సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసే దిశగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు Rajamouli హాట్‌ కామెంట్స్ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అజయ్‌ దేవగన్‌, అలియాభట్‌, శ్రియా వంటి వారితో పనిచేయడంపై ఆయన స్పందించారు. ఏషియానెట్‌ టీమ్ తో ముచ్చటించారు. అగ్ర నటులతో నటించడంపై రాజమౌళి మాట్లాడుతూ, తన సంతోషాన్ని పంచుకున్నారు. 

తారలపై పనిచేయడంపై జక్కన్న మాట్లాడుతూ, అగ్ర తారలతో పనిచేయడం తనకు చాలా సులభమని తెలిపారు. `వాళ్లు పూర్తి నిపుణులు, నటనపై మంచి అనుభవంతో ఉంటారు. వాళ్లకి ఏం చేయాలో తెలుసు. ఏది ఎలా నటించాలో తెలుసు. వారు వారికి సంబంధించి డైలాగ్స్ నేర్చుకుంటారు. దర్శకుడి వైపు చూస్తారు. డైరెక్టర్‌ కోరుకున్నది చేస్తారు. అజయ్‌ సర్‌ గురించి చెప్పాల్సి వస్తే ఆయన సెట్‌లోకి వెళ్లడానికి ముందే  ప్రిపేర్‌ అయి నన్ను చూస్తూ కూర్చుంటాడు` అని తెలిపారు రాజమౌళి.

అలియాభట్‌ గురించి చెబుతూ, ఆలియా తన లైన్‌లు, డిక్షన్‌ని సరిగ్గా పొందాలని డైరెక్షన్‌ టీమ్‌ నుంచి తనకు కావాల్సిన తీసుకుంటుంది. రెడీ అవుతుంది. దీంతో ఆమెతో పనిచేయడం నాకు ఎలాంటి కష్టంగా అనిపించలేదు. ఇక ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నా ఫ్రెండ్స్. నేనేంటో వాళ్లకి తెలుసు. వాళ్లేంటో నాకు తెలుసు. మాకు వర్క్ చేయడం చాలా ఈజీ అవుతుంది` అని చెప్పాడు జక్కన్న. 

related news: RRR first glimpse: ఫెరోషియస్, ఫియర్ లెస్ భీమ్-రామ్- గూస్ బంప్స్ గ్యారంటీ!

కరోనా సమయంలో షూటింగ్‌ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లపై స్పందిస్తూ, మామూలుగా పనిచేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మహమ్మారి సమయంలో షూటింగ్‌ అంటే పెద్ద ఛాలెంజింగ్‌ విషయం. తిరిగి షూటింగ్‌ స్టార్ట్ చేయడం, దూరం పాటించాల్సి రావడం, మాస్క్ వేసుకోవడం, టీమ్ కి అవగాహన కల్పించడం, ప్రోటోకాల్‌ పాటించడం కష్టమైనదే` అని చెప్పారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా దాదాపు పదికిపైగా భాషల్లో విడుదల కాబోతుంది. 

related news: RRR Glimpse: ఈ డిటైల్స్ గమనించారా.. ఆ ఒక్కటి మైండ్ బ్లోయింగ్
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే