Raja Vikramarka trailer: దీపావళికి గ్రాండ్‌గా ప్లాన్‌ చేశాడట..

Published : Nov 01, 2021, 08:33 PM IST
Raja Vikramarka trailer: దీపావళికి గ్రాండ్‌గా ప్లాన్‌ చేశాడట..

సారాంశం

కార్తికేయ నటిస్తున్న `రాజా విక్రమార్క` ట్రైలర్‌ విడుదలైంది. కామెడీ, డ్రామా, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కచ్చితంగా కార్తికేయ హిట్‌ కొట్టబోతున్నాడనేది సంకేతాన్నిస్తుంది. 

`ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ కార్తికేయ(Kartikeya) నుంచి వస్తోన్న మరో సినిమా `రాజా విక్రమార్క`(Raja Vikramarka). ఓ డిఫరెంట్‌ అండ్‌ పవర్‌ ఫుల్‌ కథాంశంతోరూపొందుతున్న చిత్రమిది. తాజాగా దీపావళి కానుకగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల అయ్యింది. కామెడీ, డ్రామా, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కచ్చితంగా కార్తికేయ హిట్‌ కొట్టబోతున్నాడనేది సంకేతాన్నిస్తుంది. 

ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే.. `వీడిది బలుపు కాదు దూల` అని తనికెళ్ల భరణి అనగా..`దీపావళి.. గ్రాండ్‌గా ప్లాన్‌ చేశావ్‌` అంటూ కార్తికేయ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. సుధాకర్‌ కోమాకులతో కార్తికేయ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అదే సమయంలో ఇందులో మంచి లవ్‌ యాంగిల్‌ కూడా ఉంది. కార్తికేయ నటన, లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు Kartikeya. ప్రస్తుతం ఈ చిత్ర ట్రైలర్‌ వైలర్‌ అవుతుంది. మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతుంది. 

ఇక కథ విషయానికి వస్తే.. విక్రమ్ పాత్రలో నటిస్తున్న కార్తికేయ ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఏజెంట్‌గా నటిస్తున్నారు.  చిన్నప్పుడు కృష్ణ సినిమాలు, పెద్దయ్యాక టామ్‌క్రూజ్‌ చిత్రాలు చూసి ఆవేశంతో ఎన్‌ఐఏలో చేరాడు. కొన్నాళ్లకి తన సరదా తీరిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మరి అతను ఆ జాబ్‌లో కొనసాగాడా? వదిలేశాడా? అసలు విక్రమ్‌ కథేంటి? తెలియాలంటే `రాజా విక్రమార్క` సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.

ఈ సినిమాలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దర్శకుడు వి.వి.వినాయక్‌ వద్ద పనిచేసిన శ్రీ సారిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిరెడ్డి.టి సమర్పణలో `88` రమారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. హిట్‌ కాయమనే సంకేతాలను పంపిస్తుంది. 

`ఆర్‌ఎక్స్ 100` హిట్‌తో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయాడు కార్తికేయ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బంపర్‌ హిట్‌ కొట్టింది. ఇందులో పాయల్‌ అందాలు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఆ తర్వాత కార్తికేయకి సరైన హిట్‌ దక్కలేదు. ఆ తర్వాత ఐదు సినిమాల్లో నటించినా ఆ సినిమాని మరిపించలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు `రాజావిక్రమార్క`తో డేర్‌ చేసినట్టు కనిపిస్తుంది. మరి ఈ సినిమా కార్తికేయ గట్టెక్కిస్తుందా అనేది చూడాలి. 

also read: Puneeth Rajkumar: పునీత్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన `జేమ్స్` సినిమా టీమ్‌

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే