SSMB29 Update: మహేష్‌తో సినిమాపై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన రాజమౌళి.. షూటింగ్‌ ఎప్పట్నుంచంటే?

Published : Apr 02, 2022, 04:37 PM IST
SSMB29 Update: మహేష్‌తో సినిమాపై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన రాజమౌళి.. షూటింగ్‌ ఎప్పట్నుంచంటే?

సారాంశం

సూపర్ స్టార్‌ మహేష్‌బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తీయబోయే సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారనే దానిపై రాజమౌళి స్పందించారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) చిత్రంతో సక్సెస్‌ కొట్టిన రాజమౌళి(Rajamouli) ఇప్పుడు ఇండియాలోనే మేటి డైరెక్టర్‌గా కీర్తించబడుతున్నారు. ఆయన్ని మించిన దర్శకులు లేరని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా విజయవంతంగా రన్‌ అవుతుంది. ఇది ఇప్పటికే 700కోట్లు దాటేసిందని తాజాగా యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడిప్పుడే ఈ సినిమా హడావుడి నుంచి దర్శకుడు రాజమౌళి ఫ్రీ అవుతున్నారు. 

ఇప్పుడు ఆయన తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్‌ పెట్టారు. మహేష్‌బాబు(maheshbabu)తో తన తదుపరి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ సినిమాని ప్లాన్‌ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కబోతుందని సమాచారం. పాన్‌ ఇండియా లెవల్‌లో కౌ బాయ్‌, సాహసికుడు, జేమ్స్ బాండ్‌ పాత్రల మేళవింపుగా ఇందులోని మహేష్‌బాబు పాత్ర ఉండబోతుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు జక్కన్న. సినిమా ఎప్పుడు ప్రారంభించబోతున్నారో వెల్లడించారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో, ఈవెంట్లలో పాల్గొంటున్నారు జక్కన్న. ఈ క్రమంలో ఆయన మహేష్‌తో సినిమా గురించి వెల్లడించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలోనే ఉందని వెల్లడించారు. స్టోరీ లైన్‌ రెడీ చేసుకోవడానికి, దాన్ని కొద్దిగా ప్రీ విజువలైజేషన్‌, ప్రీ ప్రొడక్షన్‌ రెడీ చేసుకోవడానికి ఆరేడు నెలలు పడుతుందన్నారు. అన్ని పూర్తి చేసుకుని ఈ ఏడాది చివర్లోనే షూటింగ్‌ స్టార్ట్ చేస్తామని తెలిపారు. ఇది డిఫరెంట్‌ జోనర్‌లో ఉంటుందని, ఇండియన్‌ సినిమా కంటే బిగ్గర్‌గా ఉంటుందని, పాన్‌ వరల్డ్  రేంజ్‌లో ఉంటుందని తెలిపారు. దాదాపు 700కోట్లతో చిత్రీకరించబోతున్నారట. 

ప్రస్తుతం మహేష్‌బాబు `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కీర్తిసురేష్‌ కథానాయిక. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అనంతరం రాజమౌళి సినిమాని పట్టాలెక్కించబోతున్నారు. దాదాపు రెండేళ్లు మహేష్‌ ఈ సినిమాకే పరిమితం కాబోతున్నారని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే