Prabhas:ప్రభాస్ తో 'యూనివర్శిల్‌ స్టూడియో ' హాలీవుడ్‌ ఫిల్మ్, సబ్జెక్ట్ ఏంటంటే

Surya Prakash   | Asianet News
Published : Apr 02, 2022, 04:11 PM IST
Prabhas:ప్రభాస్ తో 'యూనివర్శిల్‌ స్టూడియో ' హాలీవుడ్‌ ఫిల్మ్, సబ్జెక్ట్ ఏంటంటే

సారాంశం

 అందుకోసం ప్రభాస్ భారీ ఎత్తున డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.ప్రభాస్ కు ఇందు నిమిత్తం భారీ రెమ్యునేషన్ ఆఫర్ ఉంది. ఈ సినిమా వర్కవుట్ అయితే ప్రభాస్ హాలీవుడ్ హీరో అవుతారనటంలో సందేహం లేదు.


 హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ యూనివర్శిల్‌ స్టూడియో త్వరలో ప్రభాస్ తో సినిమా చేసే అవకాసం ఉందా అంటే అవుననే వినపడుతోంది. రాధేశ్యామ్ డిజాస్టర్ అయినా ప్రభాస్ క్రేజ్ ఇంచి కూడా తగ్గలేదు. భారతదేశంలో బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ బాహుబలితో అవతరించారు. ఇప్పుడు ఆయన డైరీ మొత్తం ఫిల్ అయ్యింది. 2025 దాకా ఏ నిర్మాత వచ్చినా నో చెప్పే పరిస్దితి. ఈ సిట్యువేషన్ లో రీసెంట్ గా యూనివర్శల్ స్టూడియోస్ వారు ప్రభాస్ ని ఎప్రోచ్ అయ్యినట్లు సమాచారం.

ఇప్పటికే రెండు థపాలుగా చర్చలు జరిగాయని చెప్తున్నారు. ఓ సూపర్ హీరో ఫిల్మ్ ఫ్రాంచైజ్ కు ప్రభాస్ ని అడుగున్నట్లు వినికిడి. భారతదేశంలోనూ హాలీవుడ్ స్టూడియో లు నిర్మించే సూపర్ హీరో సినిమాలకు ఓ రేంజిలో మార్కెట్ ఉంది. దాంతో ఇప్పుడు ఇక్కడ మార్కెట్ పై మరింత దృష్టి పెట్టారు. అందులో భాగంగా భారత్ లోని హీరోని తమ ఫ్రాంచైజ్ లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే అందుకోసం ప్రభాస్ భారీ ఎత్తున డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.ప్రభాస్ కు ఇందు నిమిత్తం భారీ రెమ్యునేషన్ ఆఫర్ ఉంది. ఈ సినిమా వర్కవుట్ అయితే ప్రభాస్ హాలీవుడ్ హీరో అవుతారనటంలో సందేహం లేదు.

బాహుబలి సిరీస్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు ప్రభాస్.పాన్‌ ఇండియా స్టార్ గా మారాడు.అదే స్పీడ్ లో వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.కాని యంగ్ డైరెక్టర్స్ వరుసగా అవకాశాలు ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.వారు ఫెయిల్యూర్స్ ఇస్తున్నా సరే,యంగ్ టాలెంట్ ను మాత్రం ప్రభాస్ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఏరికోరి రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ కు సాహో తీసే అవకాశం ఇచ్చాడు .

ఈ సినిమా బాలీవుడ్ లో తప్పితే ఎక్కడ విజయం సాధించలేకపోయింది.జిల్ తీసిన రాధాకృష్ణకు పిలిచి రాధేశ్యామ్ తెరకెక్కించాల్సిందిగా కోరాడు ప్రభాస్.సాహో కంటే పెద్ద బడ్జెట్‌తో అంతకంటే ఎక్కువ రోజుల షూటింగ్ తో తెరకెక్కింది రాధేశ్యామ్.భారీ అంచనాల మద్య ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం మారుతి తో ఓ సినిమా ప్లాన్ చేసారు ప్రభాస్. త్వరలోనే ఆ చిత్రం ప్రారంభం కానుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?