SSmb29లో హాలీవుడ్‌ హీరోయిన్?.. మహేష్‌ కోసం రాజమౌళి భారీ స్కెచ్‌?

Published : Mar 19, 2023, 06:20 PM ISTUpdated : Mar 20, 2023, 11:31 AM IST
SSmb29లో హాలీవుడ్‌ హీరోయిన్?.. మహేష్‌ కోసం రాజమౌళి భారీ స్కెచ్‌?

సారాంశం

రాజమౌళి తదుపరి సినిమా మహేష్‌బాబుతో ఉండబోతుందనే విసయం తెలిసిందే. దీనికి సంబంధించిన బజ్‌ ఇప్పట్నుంచే పెరిగిపోతుంది. ఈ సినిమాపై చర్చ హోరెత్తిపోతుంది. తాజాగా ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లుకొడుతుంది.

`ఆర్‌ఆర్‌ఆర్‌` హడావుడి ముగిసింది. ఈ సినిమా ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ ని సాధించింది. `నాటునాటు` పాటకి ఆస్కార్‌ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.  టీమ్‌ అంతా హైదరాబాద్‌కి చేరుకున్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా సెలబ్రేషన్స్ ముగిసాయి. ఇప్పుడు రాజమౌళి నెక్ట్స్ సినిమాపై అందరి ఫోకస్‌ వెళ్తుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్‌డేట్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల ఎలా ఉండబోతుందో దర్శకుడు రాజమౌళి తెలిపారు. విజయేంద్రప్రసాద్‌ కూడా పలు సందర్భాల్లో జోనర్‌గా గురించి చెప్పే ప్రయత్నం చేశారు. 

మహేష్‌బాబుతో రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే యాక్షన్‌ అడ్వెంచరస్‌గా సినిమా ఉండబోతుందన్నారు. మహేష్‌ ప్రపంచాన్ని చూట్టి వచ్చే సాహసికుడిగా కనిపిస్తారని అన్నారు. అయితే ఈసినిమాపై సంగీత దర్శకుడు కీరవాణి చెప్పిన కామెంట్లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. తన నెక్ట్స్ సినిమా రాజమౌళితోనే అని, ఇండియాలో సూపర్‌ స్టార్‌ అయిన మహేష్‌బాబుతో చేస్తున్నామని తెలిపారు. దీంతో ఇది ట్విట్టర్‌ని షేక్‌ చేస్తుంది. 

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్టాండర్స్ లో, అంతర్జాతీయ టెక్నిషియన్లతో, నిర్మాణ సంస్థలతో కలిసి రాజమౌళి సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రొడక్షన్‌ హౌజెస్‌తో ఆయన చర్చించడం జరిగింది. అటు వైపు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ దక్కిందని అంటున్నారు. అయితే హాలీవుడ్‌ టెక్నీషియన్లు కూడా ఈ చిత్రంలో నటింప చేయాలనుకుంటున్నారట. అందులో భాగంగా ఇప్పుడు ఓ హాలీవుడ్‌ హీరోయిన్‌ పేరు తెరపైకి వచ్చింది. `జెన్నా ఒర్టేగా` సినిమాలో హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని సమాచారం. 

జెన్నా మారీ ఒర్టేగా అమెరికన్‌ పాపులర్‌ యాక్ట్రెస్‌. బాలనటిగా కెరీర్‌ని ప్రారంభించిన ఆమె `స్టక్‌ ఇన్‌ ది మిడిల్‌` అనే సిరీస్‌తో పాపులర్‌ అయ్యింది. `ఫాలౌట్‌`, `స్క్రీమ్‌`, `ఎక్స్`, `అమెరికన్‌ కార్నేజ్‌` చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమెని మహేష్‌ సినిమాలో తీసుకోవాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే మెయిన్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీపికా ఇప్పటికే ఒకటి రెండు హాలీవుడ్‌ ప్రాజెక్ట్ లు చేసింది. ఆమెకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ఆమె మెయిన్‌ హీరోయిన్‌గా, జెన్నా ఒర్టేగా సెకండ్‌ హీరోయిన్‌గా రాజమౌళి అనుకుంటున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. అన్నట్టు `ఆర్‌ఆర్‌ఆర్‌`లో బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ ఓ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే మహేష్‌-రాజమౌళి సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. ఈ స్క్రిప్ట్ పూర్తి కావడానికి ఇంకా ఏడాది సమయం పడుతుందని, వచ్చే ఏడాదే ఈ చిత్రం పట్టాలెక్కబోతుందని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, దిగ్గజ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ రావడంతో ఆయన నెక్ట్స్ సినిమాపై అంతర్జాతీయంగా క్యూరియాసిటీ నెలకొంది. అక్కడి ఆడియెన్స్ సైతం ఈగర్‌గా వెయిట్‌ చేస్తుండటం విశేషం. ఇది మహేష్‌ సినిమాకి మార్కెట్‌ పరంగా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్‌ కాబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?