నాని ‘దసరా’ కథ ఇదేనా?

By Surya Prakash  |  First Published Mar 19, 2023, 5:28 PM IST

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. 


నాని కెరీర్ లో మొదట మాస్ సినిమా  ‘దసరా’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓడెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని ఊరమాస్ గెటప్ లో కనిపించి దుమ్ము రేపుతున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్  నాని ఫ్యాన్స్ ని కూడా ఆశ్చర్యపరిచింది. లుంగీ కట్టుకొని మాసిపోయిన గెడ్డంతో బొగ్గు గనుల్లో మునిగితేలినట్లుగా చాలా కొత్తగా వుంది నాని ఎప్పిరియన్స్. విజువల్స్, నేపధ్య సంగీతం, నానీ మ్యానరిజం, డైలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా వున్నాయి. పాన్ ఇండియా సినిమాగా దసరా ని విడుదల చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి అనే విషయమై ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ రన్ అవుతోంది.

అందుతున్న సమాచారం మేరకు  ‘దసరా’చిత్రం నాలుగు పాత్రలు చుట్టూ తిరుగుతుంది. హీరో, అతని ప్రెండ్, హీరోయిన్, విలన్. ఇవే మెయిన్ కీ రోల్స్. హీరో ప్రెండ్ పాత్ర సినిమాకు చాలా కీలకమైనది. ఆ పాత్ర ఎమోషన్ చుట్టూనే కథ అల్లారు. అదే హైలెట్ కూడా. ఇక ఈ పాత్రలు అన్నీ బొగ్గు గనుల్లో పనిచేస్తూంటాయి.  హీరో ప్రెండ్ ...కీర్తి సురేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కీర్తి పై కన్నేసిన విలన్ అతన్ని చంపేసి ఆమెను సొంతం చేసుకుందాముకుంటాడు. కానీ అతని క్లోజ్ ప్రెండ్ అయిన నాని ఈ విషయం తెలుసుకుని విలన్ కు బుద్ది చెప్పాలనకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు.  ఇది తట్టుకోలేని విలన్ అతన్ని అంతం చేయటానికి సన్నాహాలు మొదలెడతాడు. అప్పుడు నాని..ఎలా విలన్ ని అంతమొందించాడు తన స్నేహితుడుని చంపిన వాడిపై ఎలా పగ తీర్చుకున్నాడనేది మెయిన్ కథ అంటున్నారు. అయితే ఇది కేవలం ఇండస్ట్రీ జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది రిలీజ్ అయితే కానీ తెలియదు.  

Latest Videos

ఇక  ఈ సినిమా ఓవర్-బడ్జెట్ అయ్యిందని  వినిపిస్తున్నాయి.    #Dasara సినిమాని మొదట 35 కోట్లు పెట్టుబడి ప్లాన్ చేసారని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత అది ఊహించని విధంగా 65 కోట్లకు చేరిందని వినికిడి. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ : 80 కోట్లు అయ్యింది. నాని కెరీర్ లోనే టాప్ బిజినెస్ ఇది.

 నాని మాటలు దసరా పై అతనికి వున్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ‘’దసరా నాకు చాలా స్పెషల్ మూవీ. తెలుగు సినిమా గురించి నా సహకారం ఏమిటని చాలా సార్లు ఆలోచించే వాడిని. తెలుగు, ఇండియన్ సినిమాకి ఈ ఏడాది నా తరపున నుంచి సహకారం… శ్రీకాంత్ ఓదెల. అది ఎందుకో, ఎలాంటి సినిమా తీశాడో మార్చి 30న తెలుస్తుంది. సినిమా నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. గత ఏడాది తెలుగు సినిమా నుంచి ఆర్ఆర్ఆర్, కన్నడ నుంచి కేజీఎఫ్ వచ్చింది. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి దసరా వస్తోంది’’ అని చెప్పుకొచ్చారు నాని.

దసరా చిత్రంలో నేషనల్ అవార్డు విన్నింగ్‌ బ్యూటీ కీర్తిసురేశ్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌, సముద్రఖని, జరీనా వహబ్‌, దీక్షిత్ శెట్టి, మాలీవుడ్ యాక్టర్‌ షైన్‌ టామ్‌ చాకో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి దసరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంతోష్ నారాయ‌ణ‌న్ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

click me!