
నటి శిల్పాశెట్టి భర్త,, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఇటీవల సినిమా ప్రదర్శనలో కనిపించారు. అయితే రాజ్ కుంద్రా తన ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచాడు. ఎవరి కంట పడకుండా ఉండేందుకు, ఇతరుల చూపు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు రాజ్ కుంద్రా. అయితే నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకున్న అనంతరం రాజ్ కుంద్రా, యాప్ ద్వారా పోర్న్ చిత్రాలను పంపిణీ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అయితే రాజ్ కుంద్రా పూర్తిగా ముసుగువేసుకొని తిరగడం పట్ల నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు. బ్లాక్ జాకెట్, గ్లేర్స్, డెనిమ్‌లో రాజ్ కుంద్రా పూర్తిగా తన ముఖాన్ని కప్పేసుకున్నాడు. కారు దిగి లిఫ్ట్ ఏరియాకి వెళ్లాడు. ఈ క్రమంలో వెనుదిరిగి మళ్లీ ముందుకే నడిచాడు. ప్రముఖ సెలబ్రిటీ పాప్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. షమితా శెట్టి, ఆమె బ్యూ రాకేశ్ బాపట్ మరియు ఆమె తల్లి కూడా గత రాత్రి ముంబైలో జరిగిన ది బ్యాట్‌మాన్ మూవీ స్క్రీనింగ్‌లో కనిపించారు.