
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పెద్దలు చెప్పిన మాట. దీన్ని రష్మిక మందాన (Rashmika Mandanna)తూచా తప్పకుండా పాటిస్తుంది. ఫార్మ్ లో ఉండగానే ఓ రూపాయి వెనకేసుకుంటున్నారు. సినిమాకు ఏకంగా రూ. 3 కోట్లు వరకు డిమాండ్ చేస్తున్న రష్మిక, ఐటెం సాంగ్ చేయడానికి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారన్న వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ తో 'యానిమల్' టైటిల్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.
యానిమల్ (Animal)మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కోసం రష్మికను సంప్రదించారట. ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధమన్న రష్మిక... రెమ్యునరేషన్ మాత్రం గట్టిగా అడిగారట. రెండు కోట్లు ఇస్తే చేయడానికి సై అన్నారట. మేకర్స్ సైతం ఆమె కోరిక రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సముఖంగా ఉన్న నేపథ్యంలో రష్మిక ఐటెం సాంగ్ లో నటించడం లాంఛనమే అన్న మాట వినిపిస్తుంది. ఓ సాంగ్ చిత్రీకరణకు మహా అయితే వారం రోజులు సమయం పడుతుంది. మరి ఇంత తక్కువ సమయంలో రెండు కోట్ల సంపాదనంటే మామూలు విషయం కాదు.
ఇక రష్మిక గతంలో ఎన్నడూ ఐటెం సాంగ్ చేయలేదు. యానిమల్ లో ఆమె చేస్తే కెరీర్ లో ఫస్ట్ ఐటెం సాంగ్ అవుతుంది. కాగా ఐటెం సాంగ్స్ నటించడానికి ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ ఆసక్తి చూపించేవారు కాదు. అవి వాళ్ళ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతాయనే అభిప్రాయం వ్యక్తం చేసేవారు. కానీ ఇప్ప్పుడు పరిస్థితులు మారాయి. 2021 బ్లాక్ బస్టర్ పుష్ప మూవీలో సమంత (Samantha)చేసిన ఊ అంటావా ఊ ఊ అంటావా.. సాంగ్ ఎంత పెద్ద హిట్లో తెలిసిందే. స్టార్ లేడీ సమంత ఈ మూవీలో సూపర్ హాట్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేశారు. సమంత ఈ పాట కోసం రెండు కోట్లకు పైనే తీసుకున్నారని తెలిసింది.
ఒక ప్రక్క స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్స్... మధ్యలో ఐటెం సాంగ్స్ చేస్తూ గట్టిగా రాబడుతున్నారు. కాగా రష్మిక బాలీవుడ్ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆమె హీరోయిన్ గా నటించిన మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.