Kangana Ranaut Comments: బాలీవుడ్ పాపాలు కడిగే సినిమా కాశ్మీర్ ఫైల్స్: కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

Published : Mar 15, 2022, 02:05 PM IST
Kangana Ranaut Comments: బాలీవుడ్ పాపాలు కడిగే సినిమా కాశ్మీర్ ఫైల్స్: కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కాంట్రవర్సిషల్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. ముఖ్యంగా బాలీవుడ్ పై ఆమె మాటల తూటాలకు సమాధానం చెప్పలేక కామ్ గా ఉంటారు స్టార్స్. ఇక ఇప్పుడు మరో సారి బాలీవుడ్ పై విరుచుకుపడింది కంగనా.

రీసెంట్ గా కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూసింది బాలీవుడ్ స్టార్ హోరయిన్ నటి కంగనా రనౌత్. కంగనా రనౌత్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. బాలీవుడ్ చేసిన పాపాలను కడిగేసే సినిమా కాశ్మీర్ ఫైల్స్ అంటూ వ్యాఖ్యానించారు. చక్కని సినిమాను తీసిన సినిమా టీమ్ కు కంగనా అభినందనలు తెలిపారు.

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనుపమ్ ఖేర్, మిధున్ చక్రవర్తి, నటి, నిర్మాత పల్లవి జోషి నటించిన ఈసినిమా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ అవుతోంది. 
 
ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. కాశ్మీర్ పైల్స్ తెరకెక్కించిన టీమ్ కు చాలా అభినందనలు. సినిమా పరిశ్రమ పాపాలను వారు కడిగేశారు. ముఖ్యంగా  బాలీవుడ్ చేసిన పాపాలను కూడా ప్రక్షాళించారు. ఎంతో గొప్ప సినిమాను తీశారు. పరిశ్రమలో ఎలుకల్లా దాగిన వారు బయటకు వచ్చి ఈ సినిమాను ప్రోత్సహించాలి అన్నారు. 

 

అంతే కాదు  పనికిరాని సినిమాలను ప్రోత్సహించే వారందరూ ఈ మంచి సినిమాకు మద్దతుగా నిలవాలి అని కంగన పిలుపునిచ్చారు. గతవారం కూడా కంగన ఈ సినిమాకు మద్దతుగా మాట్లాడారు. ఈ ఏడాది వచ్చిన వాటిల్లో విజయవంతమైన, లాభదాయకమైన సినిమాగా కాశ్మీర్ ఫైల్స్ ను కంగనా అభినందించారు. అంతే కాదు ఈ సినిమాను కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్