ప్రముఖ నటుడి భార్య మృతి!

Published : Oct 01, 2018, 12:09 PM IST
ప్రముఖ నటుడి భార్య మృతి!

సారాంశం

బాలీవుడ్ నటుడు దివంగత రాజ్ కపూర్ భార్య కృష్ణ కపూర్(87) సోమవారం గుండెపోటుతో మరణించారు. ఆమె మరణించినట్లుగా ఆమె పెద్ద కుమారుడు రణదీర్ కపూర్ వెల్లడించారు. 

బాలీవుడ్ నటుడు దివంగత రాజ్ కపూర్ భార్య కృష్ణ కపూర్(87) సోమవారం గుండెపోటుతో మరణించారు. ఆమె మరణించినట్లుగా ఆమె పెద్ద కుమారుడు రణదీర్ కపూర్ వెల్లడించారు. కృష్ణ కపూర్ 1946 లో రాజ్ కపూర్ ని వివాహం చేసుకున్నారు.

వీరికి ఐదుగురు సంతానం. రణదీర్ కపూర్, రిషి కపూర్, రాజీవ్ కపూర్ ముగ్గురు కొడుకులు అలానే రీతు నందా, రిమా కపూర్ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఉదయాన్నే కృష్ణకపూర్ మరణించినట్లు రణధీర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

రిషీకపూర్ కుమార్తె రిధిమ సోషల్ మీడియా ద్వారా తన నానమ్మకి నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా నానమ్మ అంటూ సంతాపం వ్యక్తం చేసింది. కృష్ణ కపూర్ మరణం పట్ల ఇండస్ట్రీ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

టాక్సిక్ లో బోల్డ్ సీన్, ఈ సినిమాకి ఆమె దర్శకురాలు అంటే నమ్మలేకపోతున్నా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..