సుప్రీం కోర్టు తీర్పుపై త్రిష కామెంట్!

By Udayavani DhuliFirst Published Oct 1, 2018, 11:58 AM IST
Highlights

అయ్యప్ప స్వామీ దేవాలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. మహిళలు కూడా శబరిగిరీశుని దర్శనానికి అర్హులేనని కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రజల్లో మిశ్రమ స్పందనవస్తోంది. 

వివాదాస్పద అంశాలపై వెంటనే స్పందించే నటి త్రిష ఈ విషయంపై కూడా స్పందించింది. అయ్యప్పస్వామి ఆలయప్రవేశానికి మహిళలకు ఎలాంటి నిషేధం ఉండదని ప్రకటించిన సుప్రీం కోర్టు ఆదేశాలు స్త్రీలకు దక్కిన గౌరవం అని త్రిష వెల్లడించింది. ప్రస్తుతం ఆమె నటించిన '96' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె ఈ విషయంపై స్పందించింది. ఈ వ్యవహారం గురించి తనకి పూర్తిగా తెలియనప్పటికీ మహిళలకి దక్కిన గౌరవాన్ని ఎవరూ అడ్డుకోకూడదని వెల్లడించింది. అలానే సినిమాలో హీరోగా నటించిన విజయ్ సేతుపతి కూడా సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారు. 

click me!