బిగ్ బాస్3 హోస్ట్ చేస్తారా..? నాని ఏమన్నాడంటే!

By Udayavani DhuliFirst Published Oct 1, 2018, 11:35 AM IST
Highlights

నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2 నిన్నటితో పూర్తయిన సంగతి తెలిసిందే. 16 వారాల పాటు ఈ షోని హోస్ట్ చేశాడు నాని. మధ్యలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఫైనల్ వరకు షోని పూర్తి చేసి వెళ్లాడు. తాజాగా బిగ్ బాస్ టీమ్ సీజన్ ౩ ని కూడా హోస్ట్ చేయమని నాని వద్ద ప్రపోజల్ పెట్టిందట.

కానీ నాని మాత్రం ఈ ఆఫర్ ని రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో బిగ్ బాస్ సీజన్ ౩ మొదలుకానుంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో కూడా నాని బిగ్ బాస్ షో గురించి కొన్ని విషయాలు చెప్పాడు. వారంలో ఒకరోజు హోస్టింగ్ కోసం కేటాయిస్తే చాలనుకొని సీజన్ 2కి హోస్ట్ గా చేయడానికి అంగీకరించాడట.

కానీ షోలో ఉన్న కంటెస్టెంట్స్ కి సలహాలు ఇవ్వడానికి, కరెక్ట్ జడ్జిమెంట్ చేయడానికి వారం మొత్తం షో ఫాలో అవ్వాల్సి వచ్చిందట. దీంతో బిగ్ బాస్ షో కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఎదురైందని నాని వెల్లడించాడు. ఈ పరిస్థితుల్లో అతడు బిగ్ బాస్ ౩ హోస్ట్ చేస్తారనుకోవడం పొరపాటే.

ఇదే విషయాన్ని బిగ్ బాస్ యాజమాన్యానికి చెప్పాడట నాని. మళ్లీ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపాలనుకున్నా.. అతడు రాజమౌళి సినిమాతో బిజీగా ఉంటాడు. దీంతో ఇప్పుడు నెక్స్ట్ హోస్టింగ్ ఎవరి చేతుల్లో పెట్టాలనే విషయంపై టీమ్ ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారం!

click me!