ఇకపై నన్ను అలా పిలవొద్దు: అజిత్

By Surya PrakashFirst Published Dec 1, 2021, 7:49 PM IST
Highlights

తన గురించి రాయాల్సి వస్తే అజిత్, అజిత్ కుమార్ అనో, లేక 'ఏకే' అని మాత్రమే రాయాలని ఆ ప్రకటనలో వివరించారు. ఆయన ఏ కారణంతో ఈ సూచన చేశారన్నది ప్రకటనలో వెల్లడించలేదు.  

రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్, విజయ్ నువ్వా- నేనా అన్నట్టుగా సాగుతున్నారు.  తమిళులు ‘తలా’ అని ప్రేమగా పిలుచుకుంటూంటారు. తమిళంలో 'తలా' అంటే నాయకుడు అని అర్థం. అయితే ఇక నుంచి తనను ఎవరూ 'తలా' అని, మరే ఇతర బిరుదులతో కానీ పిలవొద్దని అజిత్ స్పష్టం చేశారు. తన పేరుకు ముందు 'తలా' అనే బిరుదును ఇకమీదట రాయొద్దని తెలిపారు. ఈ మేరకు అజిత్ ఓ ప్రకటన విడుదల చేశారు.

తన గురించి రాయాల్సి వస్తే అజిత్, అజిత్ కుమార్ అనో, లేక 'ఏకే' అని మాత్రమే రాయాలని ఆ ప్రకటనలో వివరించారు. ఆయన ఏ కారణంతో ఈ సూచన చేశారన్నది ప్రకటనలో వెల్లడించలేదు. ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, విజయం, ప్రశాంతతతో కూడిన జీవితం ప్రతి ఒక్కరికీ దక్కాలని ఆకాంక్షిస్తున్నట్టు అజిత్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 

  అజిత్  సినిమాల విషయానికి వస్తే... వాలిమై 2022 పొంగల్ సందర్భంగా విడుదల అవుతోంది. అభిమానులు అప్‌డేట్‌లు కోరుతూ మరియు #ValimaiUpdate అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ చేసిన ఒక సంవత్సరం తర్వాత వాలిమైకి సంబంధించిన చలన చిత్రం మరియు ఫస్ట్-లుక్ ఇటీవల వెల్లడైంది. ఈ సినిమాలో అజిత్ కుమార్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. గతంలో అజిత్ కుమార్‌తో నేర్కొండ పర్వైలో పనిచేసిన హెచ్ వినోద్ వాలిమై చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మించిన వాలిమైలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, పెర్లే మానే మరియు యోగి బాబు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ఇవాళ తమిళనాడులో స్టార్ హీరో! అజిత్ కెరీర్ ప్రారంభంలోనే తెలుగు సినిమా ‘ప్రేమపుస్తకం’చేసారు. ఇక్కడా అభిమానులు ఉన్నారు.  అజిత్’ కాదల్ కొండై’ తెలుగులో ‘ప్రేమలేఖ’ పేరుతో డబ్ అయ్యి, ఇక్కడా విజయ బావుటా ఎగరేసింది. అయితే… ఆ తర్వాత అజిత్ నటించిన తమిళ అనువాద చిత్రాలేవీ ఆ స్థాయిలో ఆడలేదు. కానీ ఇటీవలే తిరిగి అజిత్ సినిమాలు తెలుగులో డబ్ కావడం మొదలైంది. అజిత్ లేటెస్ట్ మూవీ ‘వాలిమై’ తో టాలీవుడ్ క్రేజీ హీరో కార్తికేయ విలన్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

also read: Kamal Haasan: కమల్‌ హెల్త్ బులెటిన్‌.. గుడ్‌ న్యూస్‌ చెప్పిన వైద్యులు.. డిశ్చార్జ్ ఎప్పుడంటే

click me!