Mohanlal:‘మరక్కార్’తెలుగు ట్రైలర్

Surya Prakash   | Asianet News
Published : Dec 01, 2021, 07:33 PM IST
Mohanlal:‘మరక్కార్’తెలుగు  ట్రైలర్

సారాంశం

పోర్చుగీసు వారు కేరళ ప్రాంతాన్ని ఆక్రమించడానికి రావడం .. వాళ్లను తన సైన్యంతో మరక్కార్ ఎదుర్కోవడం .. ఆయనను అంతం చేయడానికి వాళ్లు కొంత మంది స్వార్థపరుల సాయాన్ని తీసుకోవడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది.

మలయాళీ సూపర్ స్టార్  మోహన్‌లాల్‌(Mohanlal)  హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మరక్కార్‌’. అరేబియా సముద్ర సింహం..ట్యాగ్ లైన్. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో కీర్తి సురేష్‌, కల్యాణి ప్రియదర్శన్‌, అర్జున్‌, సునీల్‌ శెట్టి, సుహాసిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర టీమ్  తాజాగా తెలుగు ట్రైలర్ ని విడుదల చేసింది. అబ్బురపరిచే సెట్లు, యాక్షన్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్  ప్రధానబలంగా నిలిచింది. 

16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కర్ అనే కేరళ పోరాట యోధుడి కథ ఇది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, భారీ స్థాయిలో వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. పోర్చుగీసు వారు కేరళ ప్రాంతాన్ని ఆక్రమించడానికి రావడం .. వాళ్లను తన సైన్యంతో మరక్కార్ ఎదుర్కోవడం .. ఆయనను అంతం చేయడానికి వాళ్లు కొంత మంది స్వార్థపరుల సాయాన్ని తీసుకోవడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది.

బలమైన కథాకథనాలు .. భారీతనం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అలాగే ఆనాటి చారిత్రక వాతావరణాన్ని అద్భుతంగా క్రియేట్ చేయగలిగారు. అర్జున్ .. సునీల్ శెట్టి .. సుహాసిని .. కీర్తి సురేశ్ .. కల్యాణి ప్రియదర్శన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమా సంచలనానికి తెరతీయనున్నట్టే కనిపిస్తోంది. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోనీ పెరంబవూర్‌ నిర్మించిన ఈ సినిమాకి సంగీతం: రొన్నీ రాఫెల్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.తిరునావుక్కరసు. 

 ఈ సినిమాలో కుంజాలి మరక్కార్ IV (మహమ్మద్) పాత్రలో నటించారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, సిద్దిక్, కీర్తి సురేష్, మంజు వారియర్, కళ్యాణి ప్రియదర్శన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను Mohanlal ప్రాణ మిత్రుడు ప్రియదర్శన్ డైరెక్ట్ చేసారు.

ఈ సినిమా విడుదలకు ముందే 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో  జాతీయ ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైన్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డ్స్ వరించాయి. దాంతో పాటు 50వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భాగంగా బెస్ట్ కొరియోగ్రాఫీ, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకుంది.

 ‘మరక్కర్’ అరేబియా సముద్ర సింహం సినిమాను డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. తెలుగులో మాత్రం డిసెంబర్ 3న రిలీజైవుతోంది.  ముందుగా ఈ చిత్రాన్ని 2020 మార్చిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

also read: Keerthy Suresh: కుంచె నుండి జారిన కుందనపు బొమ్మగా కీర్తి... వింటేజ్ లుక్ లో అద్భుతం చేస్తున్న అమ్మడు

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే