మంచి మనసు చాటుకున్న మెగాస్టార్, బలగం మొగిలయ్యకు చిరంజీవి అభయం..

Published : Apr 18, 2023, 04:04 PM ISTUpdated : Apr 18, 2023, 04:19 PM IST
మంచి మనసు చాటుకున్న మెగాస్టార్, బలగం మొగిలయ్యకు చిరంజీవి అభయం..

సారాంశం

టాలీవుడ్ కు మెగాస్టార్ పెద్ద దిక్కులా మారారు. ఏ పెద్దరికం నాకు వద్దు అని వినయంగా తప్పుకున్నా.. కష్టాల్లో ఉన్నవారిని చూసి చలించిపోతున్నారు చిరు. ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా.. వెంటనే స్పందిస్తున్నారు. రీసెంట్ గా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు మెగాస్టార్.   

 ఇండస్ట్రీ లో చిన్నా పెద్దా.. ఎవరు  కష్టాల్లో ఉన్నా... వెంటనే స్పందిస్తారు మెగాస్టార్ చిరంజీవి. పరిశ్రమలో ఎవరైనా అనారోగ్యంతో బాధ పడుతున్నారనే వార్త  తెలిస్తే.. చాలు ఆయనకు వెంటనే తన ఆపన్న హాస్తం అందిస్తారు. వారిని ఆదుకుంటారు.  ఈ విషయం ఎన్నో సార్లు నిరూపించుకున్నారు చిరు.  ఆమధ్య  తమిళ నటి పాకీజా అలియాస్ వాసుకి.. తినడాని తిండిలేక ఇబ్బంది పడుతుంటే.. తమిళ నటికదా అని వదిలేయలేదు.. వెంటనే ఆదుకున్నారు మెగా బ్రదర్స్..  అంతే కాదు ఈ మధ్య తమిళ నటుడు పొన్నాంబలం కిడ్నీ సమస్య రావడంతో.. దిక్కు తోచని స్థితిలో ఉన్నా ఆయనకు దాదాపుగా 40 లక్షలు విలువ చేసే ట్రీట్మెంట్ ను ఫ్రీగా చేయించారు చిరంజీవి. చెన్నెైలెని అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసి.. పొన్నంబలంకు కవాల్సిన వైద్యం అందేలా చేశారు. ఈ విషయం స్వంగా పొన్నంబలమే వెల్లడవించారు. 

ఇక తాజాగా మరోసారి  మరో ఆర్టిస్ట్ కు ఆపదలో ఆదుకుని తన మంచి మనసు చాటుకున్నారు చిరంజీవి. బలగం సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్యను కూడా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు చిరంజీవి. బలగం సినిమాద్వారా గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి.. మొగిలయ్యను ఆదుకునేందుకు మందుకు వచ్చారు. కిడ్నీలు దెబ్బ తినడం, డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రెజర్‌ వంటి సమస్యలు రావడంతో.. ఆయన కంటి చూపు కూడా మందగించింది. వీటికి తోడు ఇటీవలే మొగిలయ్యకు గుండె నొప్పి కూడా రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

మొగిలయ్య  అనారోగ్యంతో కంటిచూపు పోయిందన్న  విషయం తెలుసుకున్న  చిరంజీవి.. వెంటనే బలగం డైరెక్టర్ వేణుకి పోన్ చేశారు. మొగిలయ్యకు మళ్ళీ చూపు వచ్చేలా చేయాలని.. దానికి ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని.. మొగిలయ్యకు చూపు వచ్చేలా చేద్దామని ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది.  ఆయనకు తిరిగి కంటి చూపు వచ్చేలా చికిత్స అందించేందుకు గాను  మోగాస్టార్ ఇలా కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇక చిరంజీవిం సాయం చేస్తున్న విషయాన్ని  వేణు వెంటనే  మొగిలయ్య దృష్టికి తీసుకెళ్లారుట. ఈ విషయం జరిగి చాలా రోజులు అవుతున్నా..  తాజాగా వెలుగులోకి వచ్చింది.

బలగం సినిమాకు మెగిలయ్య పాట బలాన్ని ఇచ్చింది. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాట అందరిని కంటతడి పెట్టించింది. సినిమా సక్సెస్ లో ఈ పాట భాగం అయ్యింది. ఇక మెగిలయ్య పరిస్థితి తెలిసి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్  కూడా స్పందించారు. మెగిలయ్య వైద్యానికి ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఇక ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కూడా మొగియల్యను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా మొగిలయ్యకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?