
ఎంత బోల్డ్ గా నటిస్తుందో.. అంతే బోల్డ్ గా కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది రాధిక ఆప్టే. యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. కాస్థింగ్ కౌచ్, మహిళా నటులపై వేధింపుల విషయంలో తరచూ మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది.
తాజాగా నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆమె ఇండస్ట్రీలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హాలీవుడ్ లో ఉదృతంగా సాగుతున్న 'మీటూ' ఉద్యమంపై బాలీవుడ్ నటీమణులు ఎందుకు స్పందించడం లేదని రాధిక ప్రశ్నించింది.
తనకు బాలీవుడ్ లో ఎదురైన ఓ సంఘటన గురించి చెబుతూ.. ''ఓ సినిమా షూటింగ్ సమయంలో నాకు నడుము నొప్పి వచ్చింది. అయినా.. భరించి ఆ రోజు షూటింగ్ పూర్తి చేశాను. షూటింగ్ పూర్తయిన తరువాత రూమ్ కి బయలు దేరాను. అదే సినిమాలో నటిస్తోన్న మరో నటుడు లిఫ్ట్ లో నాతోపాటు ఎక్కాడు. ఏదైనా సహాయం కావాలంటే చెప్పు. అర్ధరాత్రి అయినా వచ్చి నడుము మసాజ్ చేస్తానని అసభ్యకరంగా మాట్లాడాడు'' అంటూ రాధిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి.
ఆ విషయాన్ని సినిమా యూనిట్ కి చెప్పడంతో పెద్దలు అతడిని మందలించి తనకు సారీ చెప్పించారంటూ రాధిక వెల్లడించింది.