సిగ్గుగా లేదా..? జర్నలిస్ట్ పై సూపర్ స్టార్ ఆగ్రహం!

Published : Sep 16, 2018, 12:51 PM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
సిగ్గుగా లేదా..? జర్నలిస్ట్ పై సూపర్ స్టార్ ఆగ్రహం!

సారాంశం

ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు వారికి కూడా సుపరిచితులే. ఇక్కడ సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన ఓ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

కేరళలో ఇటీవల ఓ క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే కేరళ వరద బాధితులకు సహాయం చేయడానికి ఇటీవల మోహన్ లాల్ వెల్లింగ్టన్ ద్వీపానికి వెళ్లారు. అక్కడ ఓ విలేకరి అత్యాచార విషయంపై స్పందించమని మోహన్ లాల్ ని కోరారు. దాంతో మోహన్ లాన్ ఇలాంటి ప్రశ్నలు అడగడానికి సిగ్గుగా లేదా..? అంటూ అతడిపై విరుచుకుపడ్డారు.

''ఇలాంటి సమయంలో అనవసరమైన ప్రశ్నలు అడగడానికి సిగ్గు లేదు..? ఇక్కడ జరుగుతున్న ముఖ్యమైన కార్యక్రమానికి మీరు అడిగిన ప్రశ్నకు ఏమైనా సంబంధం ఉందా..? నేను మంచి విషయాల గురించి మాట్లాడుతుంటే మీరు అత్యాచారం గురించి అడుగుతారేంటి..? అంటూ సదరు జర్నలిస్ట్ పై అసహనం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?
Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం