సమంతాకి అలీ ప్రశ్న.. నెటిజన్లు ఫైర్!

Published : Sep 16, 2018, 01:47 PM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
సమంతాకి అలీ ప్రశ్న.. నెటిజన్లు ఫైర్!

సారాంశం

సెలబ్రిటీలతో తనకున్న చనువు కారణంగా కమెడియన్ అలీ హాస్యం కోసం వారిపై చేసే కామెంట్లు పలు వివాదాలకు దారి తీశాయి. గతంలో సోషల్ మీడియాలో అతడిని టార్గెట్ చేస్తూ నెటిజన్లు విమర్శలు చేశారు. ఈసారి అలీకి అటువంటి మరో పరిస్థితి ఎదురైంది. 

సెలబ్రిటీలతో తనకున్న చనువు కారణంగా కమెడియన్ అలీ హాస్యం కోసం వారిపై చేసే కామెంట్లు పలు వివాదాలకు దారి తీశాయి. గతంలో సోషల్ మీడియాలో అతడిని టార్గెట్ చేస్తూ నెటిజన్లు విమర్శలు చేశారు. ఈసారి అలీకి అటువంటి మరో పరిస్థితి ఎదురైంది. అలీ ఈసారి సమంతాని అడిగిన ప్రశ్నకు ఆమె అభిమానులు అలీకి ఘాటు సమాధానాలు 
ఇస్తున్నారు.

తాజాగా సమంతా తను నటించిన 'యూటర్న్' సినిమా ప్రమోషన్స్ కోసం అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఓ షోకి హాజరైంది. సోమవారం ఈ షో టెలికాస్ట్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అలీ తన చిలిపి ప్రశ్నలతో సమంతాతో మాట్లాడిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో చైతుని ఏమని పిలుస్తారని సమంతాని ప్రశ్నించగా.. కాస్త సిగ్గుపడుతూ 'బేబీ' అని ఆన్సర్ చేసింది.

దీనికి ఆమె పెద్దగా ఇబ్బంది పడలేదు. మరో సంధర్భంలో 'అత్తారింటికి దారేది' సినిమాలో కామెడీ ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ స్వామీ నదికి పోలేదా..? మాటను ప్రస్తావిస్తూ మరి నాగ చైతన్య నదికి పోలేదా..? అని ప్రశ్నించాడు అలీ. దానికి సమంతా.. చైతు నదికి వెళ్లడని తన వద్దే ఉంటాడని చెబుతూ మీరు చాలా డేంజరండి అంటూ కామెంట్ చేసింది సమంత.

దీంతో సమంత అభిమానులు అలీపై విరుచుకుపడుతున్నారు. ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగాలో కూడా తెలియదా అంటూ అతడిని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అందరి విషయాల్లో నోరు జారీ అలీ.. సమంతా విషయంలో కూడా అలా చేయడం కరెక్ట్ కాదంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?
ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..