
ప్రభాస్(Prabhas), పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటించిన పీరియాడికల్ లవ్ స్టోరీ `రాధేశ్యామ్`(Radheshyam). రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తున్నా, విజువల్ వండర్‌గా అన్ని వర్గాలను కనువిందు చేస్తుంది. సరికొత్త పాత్రలో ప్రభాస్‌ని చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా భారీ కలెక్షన్లని (Radheshyam Collections)రాబట్టింది. బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైన నేపథ్యంలో `రాధేశ్యామ్` ఫస్డ్ డే ఏకంగా రూ.79కోట్లు వసూలు చేయడం విశేషం. తాజాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. నాన్ బాహుబలి రికార్డు లను తిరగరాసిందని చెప్పొచ్చు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.79కోట్లు వసూలు చేసిందని వెల్లడించింది. కరోనా ప్రభావంలోనూ ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది యూనిట్. అయితే ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్ల విషయంలో `రాధేశ్యామ్`.. బన్నీ నటించిన `పుష్ప`ని బీట్ చేసింది. ఆ సినిమా రూ.71కోట్లు కలెక్ట్ చేసింది.
`పుష్ప`కి తొలి రోజు మిశ్రమ స్పందన లభించినా, ఆ తర్వాత క్రమంగా పుంజుకుని సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా 330 కోట్ల(గ్రాస్)కి పైగా కలెక్షన్లని రాబట్టడం విశేషం. హిందీలోనే దాదాపు 90కోట్లు వసూలు చేసింది. `పుష్ప` మాదిరిగానే `రాధేశ్యామ్` మున్ముందు సంచలనాలు క్రియేట్ చేస్తుందేమో చూడాలి. మరోవైపు ఈ చిత్రం ఓవర్సీస్‌లో రికార్డ్ ఓపెనింగ్స్ ని సాధించింది. ప్రీమియర్ తోనే ఏకంగా తొమ్మిది లక్షల డాలర్లు వసూలు చేయడం విశేషం. హాలీవుడ్ సినిమాలతో పోటీపడి మరీ అద్భుతమైన వసూళ్లని రాబడుతుందని దర్శకుడు రాధాకృష్ణ తెలిపారు.
`నార్త్ అమెరికాలో నేటి నుంచి మరికొన్ని స్క్రీన్స్ యాడ్ చేశారు. అక్కడ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో మంచి ప్రేమ కథ చూసి చాలా రోజులైంది. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన ప్యూర్ లవ్ స్టోరీ ఇది. అందులోనూ ఇండియాలో ఇప్పటి వరకు ఇంత భారీ బడ్జెట్ తో వచ్చిన ప్రేమ కథ మరొకటి లేదు. విజువల్ ఫీస్ట్ గా `రాధే శ్యామ్` వచ్చింది. ప్రభాస్ లుక్స్, స్టైలింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. ఈ సినిమాకు మరో ప్రధానమైన ప్లస్ పాయింట్ విజువల్ ఎఫెక్ట్స్. క్లైమాక్స్ అత్యద్భుతంగా వచ్చింది.
విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. జస్టిన్ ప్రభాకరన్ తనపై దర్శక నిర్మాతలు పెట్టిన నమ్మకాన్ని వందకు వంద శాతం ప్రూవ్ చేసుకున్నాడు. అద్భుతమైన పాటలు ఇచ్చాడు. మరోవైపు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్.. ఇలాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా లవ్ స్టోరీని చాలా బాగా హ్యాండిల్ చేశాడు` అని యూనిట్ పేర్కొంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం `రాధేశ్యామ్` కేవలం 26 కోట్లనే వసూలు చేయడం గమనార్హం.