Balakrishna, Rajamouli Crazy Movie: బాలకృష్ణను ఒప్పించే పనిలో రాజమౌళి, ఆపాత్ర బాలయ్యదేనట

Published : Mar 12, 2022, 02:11 PM IST
Balakrishna, Rajamouli Crazy Movie: బాలకృష్ణను ఒప్పించే పనిలో రాజమౌళి, ఆపాత్ర బాలయ్యదేనట

సారాంశం

కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేం. అలాంటివారిలో రాజమౌళి,బాలయ్య కూడా ఉన్నారు. మరి ఈ కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది. అదిగో ఇప్పుడు దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. 

మీతో సినిమా చేయడం కష్టం సార్ అని బాలకృష్ణ ముఖానే అనేశాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. మీకు కోసం ఎక్కువ.. మీతో సినిమా చేయాలంటే బేసిక్ గా నాకు భయం అన్నాడు. కాని ఇప్పుడు బాలయ్యతో రాజమౌళి సినిమా కోసం సన్నాహాలు జరుగుతున్నాయి  అనేది సోషల్ మీడియా టాక్. అసలు ఏ సినిమా చేస్తన్నాడు జక్కన్న బాలయ్యతో.. ఇది ఎంత వరకూ నిజం..? 

స్తుతం రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను ఆయన మహేశ్ బాబుతో చేయనున్నాడు. దీని కోసం ఏర్పాట్లు కూడా లోపల జరుగుతున్నాయి. అయితే  రాజమౌళి ప్రీ ప్రోడక్షన్ కంప్లీట్ చేసేలోపు  మహేశ్ బాబు .. త్రివిక్రమ్ సినిమాను కూడా పూర్తిచేసేలా ప్లాన్ చేసుకున్నాడు. 

అయితే జక్కన్నతో మహేశ్ బాబు చేయబోయే  సినిమాలో కీలకమైన ఓ పవర్ఫుల్ రోల్ ఉందట. ఈ పాత్రను బాలకృష్ణ చేస్తే బాగుంటుందని రాజమౌళి భావించాడట. ఎలాగైనా ఈ క్యారెక్టర్ బాలయ్యతోనే చేయించాలని పట్టుదలతో ఉన్నాడట జక్కన్న. ఆయనను ఒప్పించే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. బాలయ్య హీరోగా సినిమా చేస్తాడమో అంటే.. మహేష్ సినిమాలో పవర్ ఫుల్ రోల్ చేయించే ప్రయత్నం చేస్తుండటంతో.. బాలయ్య ఈ పాత్రకు ఒప్పుకుంటాడా లేదా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. 

అయితే గతంలో మాత్రం  మోహన్ బాబు ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా బాలకృష్ణ మంచు వారి ఫ్యామిలీ మూవీ  ఊ కొడతారా ఉలిక్కిపడతారా లో ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇప్పుడు కూడా ఇదే హోప్ తో బాలయ్యను ఒప్పించే పనిలో ఉన్నారట టీమ్. ఇది ఎంత వరకూ నిజమో కాని మహేష్ తో బాలయ్య సినిమా అది కూడా రాజమౌళి డైక్షన్ లో అంటే అది ఊహాతీతం అయిపోయింది.  

అలా మహేశ్ బాబు సినిమాలోనూ బాలకృష్ణ కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల టాక్ షోలో అటు రాజమౌళితోను .. ఇటు మహేశ్ బాబుతోను కలిసి ఎంతలా సందడి చేసిందీ తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్న  బాలయ్య, ఆ తరువాత అనిల్ రావిపూడి, ఆతరువాత పూరీ జగన్నాథ్ లతో  సినిమా చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే
Bigg Boss 9 Telugu : పీఆర్ ల కన్నింగ్ గేమ్.. కళ్యాణ్ కోసం డీమాన్ పవన్ ని బలి చేశారుగా..!