
చీటింగ్ ఆరోపణ ఎదుర్కొంటున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) స్పందించారు. శరణ్ అనే వ్యక్తి నుంచి 2018లో రూ.50 లక్షలు, ఆ తర్వాత రూ.35 లక్షలు తీసుకున్నట్టు సదరు వ్యక్తి హైదరాబాద్ కోర్టులో ఫిర్యాదు చేశారు. మెత్తం రూ.85 లక్షలు తనకు తిరిగి ఇప్పించాలని కోరారు. అయితే డైరెక్టరర్ గోపిచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు పెట్టుబడిగా తన దగ్గర రూ.85 లక్షలు తీసుకున్నట్టుు శరణ్ తెలిపారు. ఈ మేరకు తన దగ్గర తీసుకున్న డబ్బులతో సినిమా నిర్మించబోతున్నట్టు చెప్పారని, ఆ సినిమాలోనూ తనను భాగస్వామిని చేస్తానని నమ్మించారన్నారు.
ఇందుకు గాను ఆయన డబ్బులు ఇచ్చాడని, కానీ కొద్ది రోజుల తర్వాత సినిమాలో తనను భాగం చేయకుండా, తిరిగి డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. అటునుంంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టు ను ఆశ్రయించినట్టు తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. అయితే ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను.. నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగమే మాపై కేసు నమోదు అయ్యింది. నాకు శరన్ ఎలాంటి డబ్బు ఇవ్వలేదు. నాపై, నాకొడుకు పైనా కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శరన్ ఒక్క పైసా మాకు ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసుల ముందు ఉంచాలి. శరన్ తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారు..
నేను డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టక పోతే పరువునష్ట దావా వేస్తా, బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడ్తున్నారు. పోలీసుల విచారణకు నేను తప్పకుండా సహరిస్తాను. ఇంకా శరణ్ నే ఆధారాలు తీసుకురావాలంటూ కోర్టు నోటీసులు ఇచ్చింది. నా పిల్లలే నా ప్రపంచం, శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటా.. అతని పై పరువు నష్టం దావా వేస్తా. నాకు కోర్టు నుండి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు అందలేదు. నా పై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారు.
శరణ్ ది మా ఊరే... పదేళ్ళ క్రితం పరిచయం అయ్యాడు. టికెట్ల కోసం ఫోన్ చేస్తూ ఉండేవాడు. శరణ్ అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు.. అతన్ని క్షమించమని వేడుకున్నా నేను ఊరుకోను. బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు. శరణ్ వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు.. అతనెవరో త్వరలో బయట పెడతాను’ అంటూ స్పందించారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.