
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కి మోస్ట్ అవైటెడ్ మూవీగా మారింది. ఈ సినిమాను పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించటంతో సినీ లవర్స్ సైతం ఆసక్తిగా ఈ ఫిల్మ్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రేమ, విధి అనే సబ్జెక్ట్ తో అత్యద్భుతంగా తెరకెక్కించారని చెప్పబడుతున్న ఈ సినిమాకు సంబంధించిన పాటలు, వీడియోలు ఇప్పటికే రిలీజ్ అయ్యి అదే రేంజ్ లో ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నార్త్ మార్కెట్ ఎలా ఉండబోతోందనే విషయం చర్చగా మారింది. ఎందుకంటో సాహో చిత్రం తెలుగులో ఆడకపోయినా నార్త్ లో కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది.
అందుతున్న సమాచారం మేరకు ...నార్త్ లో సైతం ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. హిందీ ఆల్బమ్ రాధేశ్యామ్ సూపర్ సక్సెస్ అయ్యింది. సినిమా రిలీజ్ డే ను కూడా రీసెంట్ గా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫిల్మ్ టీమ్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టింది. అలాగే ఈ సినిమా రన్‌టైమ్ గురించి కూడా ఓ అప్డేట్ వచ్చింది. హిందీలో ఈ సినిమాకు రీజనబుల్ రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారని వినికిడి. ‘రాధేశ్యామ్’ హిందీ వర్షన్ సెన్సార్ పూర్తి అయిందని, అక్కడ ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 31 నిమిషాలు ఉండనుందని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమే అయితే...రీజనబుల్ రన్ టైమ్ ఉన్న సినిమాలు సాగదీత లేకుండా, ఎక్కడా బోర్ కొట్టకుండా ఆకట్టుకునేలా ఉంటాయనేది నిజం.
అయితే అదే సమయంలో ఈ చిత్రం యుఎస్ మార్కెట్ ప్రీమియర్ షోల విషయానికి వస్తే తెలుగు వెర్షన్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎగ్జామ్స్ సీజన్ లో ఇక్కడ కూడా అడ్వాన్స్ లు అదిరిపోతున్నాయి. కాకపోతే ఫస్ట్ ప్రీమియర్ పడ్డాక వచ్చే రెస్పాన్స్ ని బట్టే నాన్ తెలుగు,నార్త్ పీపుల్ సినిమాకు వెళ్లే వాతావరణం కనపడుతోంది.ఎందుకంటే హిందీ,తమిళ వెర్షన్స్ కు యుఎస్ లో అడ్వాన్స్ బుక్కింగ్ లు చాలా డల్ గా ఉన్నాయి. అందుకు కారణం ఇది యాక్షన్ సినిమా కాకపోవటమే అంటున్నారు.
ఇక ‘రాధేశ్యామ్’ చిత్రంలో ప్రభాస్ చేయి చూసి జాతకం చెప్పే విక్రమాదిత్య పాత్రలో నటిస్తుండగా.. రెబల్ స్టార్ కృష్ణం రాజు పరమహంస అనే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ ఈ సినిమా ద్వారా తెలుగు తెరపై తొలిసారి కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తమిళనాట ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన పంపిణీ సంస్థ విడుదల చేస్తోంది. ఈ చిత్రానికి డిజిటల్ శాటిలైట్ హక్కులు అన్ని భాషలు కలుపుకొని రూ. 250కోట్ల భారీ ధరకు డీల్ కుదిరిందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే నిర్మాతలకు ఇప్పటికే 70 శాతం రిటర్న్స్ వచ్చేశాయంటున్నారు. చూడాలి మరి భాక్సాఫీస్ ఏ విధంగా ఈ సినిమాతో షేక్ అవుతుందో..నార్త్ పరిస్దితి ఏమిటో...