
వరుస సిమాలతో దూకుడు మీద ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ప్రతీ సినిమాకు ఒక వేరియేషన్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం రామారావ్ ఆన్ డ్యూటీ హడావిడిలో ఉన్నాడు మాస్ మహారాజ్.
రవితేజ తన కెరియర్లో చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేశాడు. అలాగే ప్రస్తుతం కూడా తాను శరత్ మండవ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ.. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో డిప్యూటీ కలెక్టర్ గా రవితేజ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా దివ్యాన్ష కౌశిక్ - రజీషా విజయన్ నటిస్తున్నారు.
ఇక రవితేజ ఈ సినిమా కోసం ఫారెన్ వెళ్లినట్టు తెలుస్తోంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈసినిమా పాటల షూటింగ్ కోసం టీమ్ అంతా స్పెయిన్ వెళ్లినట్టు సమాచారం. ఆయన స్వరపరిచిన పాటలలో కొన్నిటిని చిత్రీకరించడానికి ఈ సినిమా టీమ్ స్పెయిన్ ను ఎంచుకుంది. అక్కడి అందమైన లొకేషన్స్ లో పాటలను షూట్ చేయడానికి టీమ్ వెళ్లింది. పాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని శరత్ మండవ చెబుతున్నాడు.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా.. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ తో పాటు ముఖ్యమైన పాత్రలలో నాజర్, నరేశ్ , తనికెళ్ల భరణి లాంటి స్టార్స్ కనిపించబోతున్నారు. రవితేజ తరువాతి ప్రాజెక్టులుగా రవితేజ ధమాకా.. రావణాసుర.. టైగర్ నాగేశ్వరరావును లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.