Shilpa Shetty, John Abraham Dance: పాతరోజులు గుర్తు చేసుకున్న శిల్పాశెట్టి, జాన్ అబ్రహం...

Published : Mar 08, 2022, 01:52 PM IST
Shilpa Shetty, John Abraham Dance: పాతరోజులు గుర్తు చేసుకున్న శిల్పాశెట్టి, జాన్ అబ్రహం...

సారాంశం

జాన్ అబ్రహంతో కలిసి శిల్పా శెట్టి మళ్లీ పాతరోజుల్లోకి వెళ్లింది. డోస్తానా స్టెప్పులతో సందడిచేసింది.   

శిల్పాశెట్టి, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా దోస్తానా. 2008లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీని మరోసారి శిల్పా శెటి.. జాన్ అబ్రహం అభిమానులకు గుర్తు చేశారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్టీ ఎంతలా వర్కౌట్ అయ్యిందో అందరికి తెలుసు.. వీరి మధ్య హాట్ సాంగ్స్ కూడా అదరిపోయేలా హిట్ అయ్యాయి. 

దోస్తానా సినిమాలో షటప్ అండ్ బౌన్స్ పాట సూపర్ హిట్ అయ్యింద. ఈ పాటలో వీరిద్దరు హాట్ హాట్ గా కనిపించారు. ఇక మరోసారి  వీరిద్దరు ఈ సాంగ్ కు  చిందులేశారు. కలసి డ్యాన్స్ చేసిన వీడియోను బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఎక్కడ కలిశారు, ఎక్కడ ఈ డాన్స్ వేశారన్న విషయాన్ని మాత్రం వీళ్లు చెప్పలేదు. 

 

అప్పట్లో ఎంత ఉత్సాహంతో ఇద్దరూ డ్యాన్స్ చేశారో.. ఇప్పుడు వీడియోలో కూడా అంతే ఉత్సాహంతో స్టెప్పులేశారు వీరిద్దరు. ఈ వీడియోలో హడావిడికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పోస్ట్ కు శిల్పా ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. మాకు తెలియని కలయిక ఇదిఅంటూ శిల్పాశెట్టి పోస్ట్ పెట్టారు. 

ఇక జాన్ అబ్రహం పలు ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలసి అటాక్; షారూక్ ఖాన్, దీపిక పదుకొణెతో కలసి పఠాన్, అర్జున్ కపూర్ దిషా పఠానిలతో కలసి ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలు చేస్తున్నాడు. శిల్పా శెట్టి కాంట్రవర్సీల సుడిగుండంలో తిరుగుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?