Radhe Shyam: ఊహించని ట్విస్ట్ లు, క్లైమాక్స్ అదిరిపోతుంది.. ప్రభాస్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 23, 2021, 10:41 PM IST
Radhe Shyam: ఊహించని ట్విస్ట్ లు, క్లైమాక్స్ అదిరిపోతుంది.. ప్రభాస్

సారాంశం

దేశవ్యాప్తంగా రాధే శ్యామ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో రాధే శ్యామ్ ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. 

దేశవ్యాప్తంగా రాధే శ్యామ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో రాధే శ్యామ్ ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. 

ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే ఈ చిత్ర ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. రాధాకృష్ణ దర్శకుడు. ప్రీరిలీజ్ వేడుకలో ప్రభాస్ ప్రసంగించారు. ఎప్పటిలాగే ప్రభాస్ కొద్దిసేపు మాత్రమే మాట్లాడాడు. పెదనాన్న లుక్ చూశారుగా చిన్నసైజు దేవుడిలా ఉన్నారు. ఈ చిత్రం కోసం కోవిడ్ టైంలో చాలా కష్టపడ్డాం. చాలా సార్లు షూటింగ్ ఆపి మళ్ళీ మొదలు పెట్టాల్సి వచ్చింది. 

ఒక సినిమాపై 5 ఏళ్ళు సమయం కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రం కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. ట్రైలర్ చూశారుగా ఎలా ఉందో.. ఈ చిత్రంలో చాలా ట్విస్ట్ ఉంటాయి. క్లైమాక్స్ మిమ్మల్ని మెప్పించే విధంగా ఉంటుంది అనుకుంటున్నా అని ప్రభాస్ తెలిపాడు. 

ఇండియా మొత్తం తిరిగి ప్రచార కార్యక్రమాలు చేస్తున్నా నాకు ఇంకా సిగ్గు పోలేదు. అందుకే కొంచెమే మాట్లాడుతున్నా అని ప్రభాస్ వేదికపై సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రభాస్ ప్రసంగిస్తుండగా మధ్యలో నవీన్ పోలిశెట్టి కాసేపు కామెడీ పంచ్ లు వేశాడు. 

ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా కనిపించబోతున్నాడు. ప్రభాస్ తన కెరీర్ లో పోషిస్తున్న విభిన్నమైన రోల్ ఇది. ప్రేరణ అనే యువతిగా పూజా హెగ్డే నటిస్తోంది. వీరిద్దరి కలయిక.. ట్రైలర్ లో చూపిస్తున్న ప్రళయం విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

Also Read: Radhe Shyam Trailer: ది గ్రేట్ విక్రమాదిత్య.. పామిస్ట్రీ లో ఐన్ స్టీన్ అతడు, ప్రళయం సృష్టించే ప్రేమ కథ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Surekha Vani కి రెండో పెళ్లి, కూతురు సుప్రీత ప్లాన్‌.. ఆఫర్స్ లేవంటూ ఆవేదన
ఫస్ట్ టైమ్‌ డేట్‌కి వెళ్తున్నారా? ఈ 7 బెస్ట్ రొమాంటిక్ సినిమాలు చూడండి