Radhe Shyam: ‘రాధేశ్యామ్‌’ఓటీటి రిలీజ్ టైమ్,ఫ్లాట్ ఫామ్

By Surya Prakash  |  First Published Dec 29, 2021, 8:09 AM IST

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో రాధేశ్యామ్ ఒక‌టి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. 


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న అందమైన ప్రేమ కావ్యం రాధే శ్యామ్. ఈ రాధే శ్యామ్ సినిమాను కూడా సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని ట్రైలర్ చూసిన తర్వాత  సినిమా మేకర్స్, సినీ లవర్స్  చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 14,2022 న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

ఈ చిత్రం రిలీజ్ కు ముందే రాధేశ్యామ్ ఓటీటి రిలీజ్ అంటూ సోషల్ మీడియాలో బజ్ వచ్చింది. మరో ప్రక్క కరోనా మరోసారి దాడి చేస్తూండటంతో ఈ సినిమాని ఓటీటిలలో చూడాలని కొందరు ఫిక్స్ అవుతున్నారు. మరి ఓటీటి రిలీజ్ ఎప్పుడు...ఏ ఓటీటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా రాబోతోంది

Latest Videos

నార్మల్ గా యూజవర్ ఫార్మెట్ ప్రకారం పెద్ద సినిమా ఏదైనా థియోటర్ రిలీజ్ అయిన 30రోజుల తర్వాత ఓటీటిలోకి వస్తోంది. అంటే పిబ్రవరి మూడవ వారంలో ఈ సినిమా ఓటీటి రిలీజ్ ఉంటుందన్నమాట. రాధేశ్యామ్ సౌత్ వెర్షన్స్ అంటే తెలుగు,తమిళ్, మళయాళం, కన్నడ Zee5 లో స్ట్రీమ్ అవుతాయి. హిందీ వెర్షన్ విషయానికి వస్తే నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. 
 
ఇక బాహుబలి బంపర్ హిట్ తర్వాత సాహో లాంటి ఫ్లాప్ ఇచ్చాడు ప్రభాస్. దీంతో నిరాశకు గురైన ఫ్యాన్స్ తర్వాతి ప్రాజెక్టు కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అదే రాధేశ్యామ్. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కావడంతో.. ఇది కూడా భారీ బడ్జెట్ తో రెడీ చేసారు.  జిల్ లాంటి కమర్షియల్ హిట్ గోపీచంద్ కు ఇచ్చిన రాధాకృష్ణకుమార్ దే ఈ ప్రాజెక్ట్. కేవలం కథ నచ్చి ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్నాడనే వార్తలున్నాయి. అందుకే ఇది క్రేజీ ప్రాజెక్టుగా మారింది.  

ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఇక ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి సినిమా రాబోతుండడంతో రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్. 60ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోంది.  ఇది కాలం, జాతకాలతో ముడిపడి ఉన్న ప్రేమ  కథని తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read:Vijay Devarakonda : అల్లు అర్జున్ తరువాత విజయ్ దేవరకొండనే... రౌడీ హీరో రికార్డ్.

click me!