Vijay Devarakonda : అల్లు అర్జున్ తరువాత విజయ్ దేవరకొండనే... రౌడీ హీరో రికార్డ్.

Published : Dec 29, 2021, 07:19 AM IST
Vijay Devarakonda : అల్లు అర్జున్ తరువాత విజయ్ దేవరకొండనే... రౌడీ హీరో రికార్డ్.

సారాంశం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సోషల్ మీడియా ఫాలోయింగ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. సౌత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ తో విజయ్ దేవకొండ కూడా చేరిపోయారు. టాలీవుడ్ లో అల్లు అర్జున్ తరువాత ప్లేస్ ను  విజయ్ దేవరకొండ సాధించాడు.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ  ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ బేస్ తో పాటు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆయన సొంతం. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ గా మారిన  విజయ్.. అప్పటి నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా జెండా పాతడానికి లైగర్ మూవీతో ప్రయోగం చేయబోతున్నాడు విజయ్.

ఇక Vijay Devarakonda సోషల్ మీడియా ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతుంది. ఇన్ స్టాలో దూసుకుపోతున్నాడు రౌడీ హీరో. స్టార్ హీరోల ఫాలోయింగ్ పెరగడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంటే.. విజయ్ మాత్రం కేవలం నాలుగేళ్లలో క్రేజీ ఫాలోయింగ్ ను సాధించాడు. ఇన్ స్టాలో విజయ్ ఫాలోవర్స సంఖ్య 1 కోటి 40 లక్షలు దాటింది. టాలీవుడ్ లో అల్లు అర్జున్(Allu Arjun) తరువాత అంత ఫాలోవర్స్ ఉన్న హీరోగా విజయ్ దేవరకొండ ఉన్నారు. అల్లు అర్జున్ కు విజయ్ దేవకొండకు కూడా ఇన్ స్టా ఫాలోవర్స్  విషయంలో పెద్ద తేడా లేదు. అల్లు అర్జున్ కు ఇన్ స్టా గ్రామ్ లో 1కోటీ 44 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా కొన్ని రోజుల్లో  బన్నీ ని కూడా క్రాస్ చేసి విజయ్ ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంది.

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ  పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్(Liger) మూవీ చేస్తున్నారు. ఈమూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను పూరీ, ఛార్మీలతో కలిసి.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈసినిమాలో హాలీవుడ్ స్టార్ బాక్సార్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నారు. రీసెంట్ గానే అమెరికాలో టైసన్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు టీమ్. లైగర్ ను వచ్చు ఏడాది అగస్ట్ 25న రిలీజ్ చేయబోతున్నట్టు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఈమూవీ హిట్ కొడితే విజయ్ ఇమేజ్ ఇంతకు రెండింతలు అవుతుంది.

Also Read : Salman Khan Dance : సల్మాన్ ఖాన్ తో పోటీపడి డాన్స్ చేసిన జెనీలియా.. వైరల్ అవుతున్న వీడియో.

లైగర్ తరువాత చేసే సినిమాలు కూడా లైన్ అప్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. పూరీ తరువాత వెంటనే సుకుమార్(Sukumar) తో చేయబోయే సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు విజయ్. ఈమూవీ కూడా పాన్ ఇండియాను టార్గెట్ చేసుకుని తెరకెక్కబోతోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ చూసేశాడు సుకుమార్. విజయ్ దేవరకొండతో ఆ రేంజ్ సినిమా చేయడం సుకుమార్ కు పెద్ద విషయమేమి కాదు. అటు శివ నిర్వాణతో కూడా విజయ్ సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో