బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎందరో సౌతిండియా స్టార్స్ ఎక్కలేని ఎత్తులకు వెళ్లారు. ఆయన కెరీర్ పీక్స్ కు వెళ్లిపోయింది. ఇండియా మొత్తం ఆయన సినిమాలు రిలీజ్ కోసం ఎదురుచూసే పరిస్దితి ఏర్పడింది.దాంతో ప్యాన్ ఇండియా సినిమాలే వరసగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఇమ్మిడియట్ గా చేసిన సాహో ఆ క్రేజ్ ని,ఊపుని కొంతవరకూ తగ్గించిందనే చెప్పాలి.
హై ఎక్సపెక్టేషన్స్ తో వచ్చిన సాహో సినిమా నార్త్ లో బాగా వర్కవుట్ అయినా తెలుగులో ఆడలేదు. దాంతో ఈ ప్రభావం ప్రబాస్ తర్వాత సినిమాల బిజినెస్ పై ఉంటుందా ఉండదా అనే డిస్కషన్స్ ఆ మధ్యన జరిగాయి. అయితే ఆయన వరస సినిమాలు చూసి ప్రభాస్ క్రేజ్ తగ్గలేదు..ఇమేజ్ కు కొంచెం కూడా డామేజ్ అవ్వలేదని అంతా సంతోషపడ్డారు.
అయితే ఇప్పుడు రాధే శ్యామ్ తెలుగు రైట్స్ అనుకున్న స్దాయిలో బిజినెస్ కావటం లేదనే వార్త మీడియాలో మొదలైంది. దాంతో సాహోతో ప్రభాస్ ఇమేజ్ కు పెద్దగా కాకపోయినా కొద్దిగా అయినా దెబ్బ పడిందని అంటున్నారు. సాహో సినిమాని భారీ రేట్లుకు కొని బోల్తా పడిన డిస్ట్రిబ్యూటర్స్ కొందరు ఇప్పుడు రాధేశ్యామ్ కు ఆ రేట్లు ఇవ్వలేమని అంటున్నారట. దాంతో నాన్ బాహుబలి స్దాయిలో ఈ సినిమా బిజినెస్ కావటం లేదంటున్నారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయిన తర్వాత క్రేజ్ వచ్చే అవకాసం ఉంది అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం బిజినెస్ కన్నా పదిశాతం తక్కువ తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఎంతవరకూ ఈ వార్తల్లో నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్ పతాకంపై ‘జిల్’ఫేమ్ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను 2021 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్ర యూనిట్ ప్రణాళిక చేస్తునట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.
ఓ పాట మినహా రాధేశ్యామ్ చిత్రీకరణనంతా పూర్తి చేసేసుకుందని టాక్. ఈ పాటతో పాటు కృష్ణంరాజు, ప్రభాస్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందట. మొత్తం వారం రోజుల షూటింగ్ మాత్రమే బాకీ ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్’పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస తన కెమెరా పనితనాన్ని చూపెట్టనున్నారు. సచిన్ ఖడేకర్, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీశర్మ, కృనాల్ రాయ్ కపూర్ ఇతర పాత్రల్లో నటిస్తుండగా, కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం!