యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తోన్న రాధే శ్యామ్‌కి చూస్తూంటే చాలా ప్రత్యేకతలు ,విశేషాలు ఉన్నాయి. అవి ఒక్కోటి రివీల్ అవుతూంటే జనం షాక్ అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం గురించిన ఓ న్యూస్ వెబ్ లో హల్ చల్ చేస్తోంది. ఆ న్యూస్ విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఇలాక్కూడా చేస్తారా అని షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏమిటా విషయం ...
ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. అభిమానులు ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యే ఈ చిత్రం టీజర్ కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓ చిత్రమైన వార్త బయిటకు వచ్చింది. అది ఈ చిత్రం సంగీత దర్శకుడు గురించి. మొదట్లో ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారో అని అభిమానుల్లో కొంత కాలం మంచి టాపికే నడిచింది. ఆ తర్వాత సంగీత దర్శకుడు ఖరారు అయ్యారనే ప్రకటన వచ్చింది. యువ సంగీత తరంగం జస్టిన్ ప్రభాకరన్ రెబల్‌స్టార్ మూవీకి సంగీతం అందించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ మూవీకి మొదట సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేది ఖరారు కాగా.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అది ప్రక్కన పెడితే ఈ సినిమాకు మరో సంగీత దర్శకుడు కూడా పనిచేస్తున్నారట. ఈ సినిమాకు రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ రెడీ చేసారని టాక్. మన సౌతిండియన్ అన్ని భాషల్లోనూ జస్టిన్ సంగీతం అందివ్వగా హిందీ వెర్షన్ కు గాను బాలీవుడ్ ఫేమ్ మిథున్ సంగీతం అందించారని తెలుస్తోంది. దీనితో నార్త్ కి ఒకరు సౌత్ కి ఒకరు ఈ సినిమాకు పని చేసారని చెప్పాలి.
ఇప్పటికే ఈ సినిమా సంగీతంపై మంచి బజ్ ఉంది. లవ్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకు అదిరిపోయే పాటలు ఉండాలి. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ద్వారా జస్టిన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ ఫలితం ఎలా ఉన్నా.. పాటలను అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ సినిమా ఆఫర్‌ని సొంతం చేసుకున్నారు జస్టిన్. పీరియాడిక్ రొమాంటిక్ ప్రేమ కథగా రాధే శ్యామ్ తెరకెక్కుతోంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రం బిజినెస్ ఇప్పటికే ఊపందుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ‘రాధేశ్యామ్’ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని ప్రీమియర్ డిస్ట్రిబ్యూటర్ గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు సొంతం చేసుకున్నారు. వారు 22 కోట్లకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్న వార్త. ఈ కరోనా టైమ్ లో ఇది అది పెద్ద విషయం. ఇప్పటి వరకు కేవలం ఓవర్ సీస్ సినిమా పంపిణీలోనే అడ్వాన్స్ లేకుండా ఫుల్ పేమెంట్ తో సినిమా బిజినెస్ జరుగుతుంది. ఈ సినిమాకు అలాగే జరిగిందని తెలుస్తోంది.
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్‌కర్, భీనా బెనర్జి, మురళి శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస ఎడిటర్ : కొటగిరి వెంకటేశ్వరావు యాక్షన్, స్టంట్స్ : నిక్ పవల్, సౌండ్ డిజైన్ : రసూల్ పూకుట్టి కొరియోగ్రఫి : వైభవి మర్చంట్ కాస్ట్యూమ్స్ డిజైనర్ : తోట విజయ భాస్కర్ అండ్ ఎకా లఖాని వి ఎఫ్ ఎక్స్ సూపర్‌వైజర్ : కమల్ కన్నన్ ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : ఎన్.సందీప్, హెయిర్‌స్టైల్ : రోహన్ జగ్టప్ మేకప్ : తరన్నుమ్ ఖాన్ స్టిల్స్ : సుదర్శన్ బాలాజి పబ్లిసిటి డిజైనర్ : కబిలాన్ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను కాస్టింగ్ డైరక్టర్ : ఆడోర్ ముఖర్జి ప్రోడక్షన్ డిజైనర్ : రవీందర్ చిత్ర సమర్పకులు : "రెబల్‌స్టార్" డాక్టర్ యు వి కృష్ణంరాజు నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రశీదా దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.