'జాంబీ రెడ్డి' 5 రోజుల కలెక్షన్స్ ! నష్టమా?లాభమా?

Surya Prakash   | Asianet News
Published : Feb 11, 2021, 04:58 PM IST
'జాంబీ రెడ్డి' 5 రోజుల కలెక్షన్స్ ! నష్టమా?లాభమా?

సారాంశం

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ రూపొందించిన మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’తో తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టించారు.  ఫిబ్ర‌వ‌రి 5కు ఈ సినిమా రిలీజైంది. టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమా ప్లాన్ చేసారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’ కావ‌డంతో ఈ సినిమాకు మంచి క్రేజే వచ్చింది. ఈ చిత్రం విజయయాత్రలు చేస్తోంది టీమ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఐదు రోజుల కలెక్షన్స్ ఎంత వచ్చాయి. అసలు ప్రాజెక్టు సేఫా లేక నష్టమా అనే విషయాలు చూద్దాం.   


ఈ సినిమా మార్నింగ్ షోకే  డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే .. బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌దొక్కుకోవ‌డం, సేఫ్ జోన్‌లో ప‌డ‌డం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి టాక్ తో ఈ స్దాయి కలెక్షన్స్ అంత తేలికైన విష‌యం కాదు అంటున్నారు.  గ‌త శుక్ర‌వారం విడుద‌లైన  జాంబీ రెడ్డి  యావ‌రేజ్‌, బిలో యావ‌రేజ్ అన్న టాక్ తెచ్చుకున్నా బ్రేక ఈవెన్ తెచ్చుకుని నిల‌దొక్కుకుంది. తొలి 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక నుంచి వ‌చ్చేవ‌న్నీ లాభాలే అని టీమ్ సంబరాలు చేసుకుంటున్నారు.  ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్ల‌కు లాస్ లేదు. నిర్మాత హ్యాపీగా ఉన్నారు.
  
 'అ!' 'కల్కి' చిత్రాల తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి వచ్చిన సినిమా కావడంతో జాంబి రెడ్డిపై పాజిటివ్ బజ్ బాగా క్రియేట్ అయింది.  మెగా హీరోలతో పాటు పలువురు సినీ ప్రముఖులు తేజ సజ్జ డెబ్యూ సినిమాకు అండగా నిలివటంతో సినిమా జనాల్లోకి బాగానే వెళ్లింది. దాంతో 'జాంబీరెడ్డి' చిత్రాన్ని గీతా డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసింది. 

జాంబీ రెడ్డి 5 రోజుల వ‌సూళ్లు ఇవీ..

 నైజాం 1.56కోట్లు

సీడెడ్ 0.93కోట్లు

ఉత్తరాంధ్ర 0.55కోట్లు

ఈస్ట్ 0.40కోట్లు

వెస్ట్ 0.32కోట్లు

కృష్ణా 0.41కోట్లు

గుంటూరు 0.43కోట్లు

నెల్లూరు 0.27కోట్లు

ఏపీ+తెలంగాణ టోటల్ 4.87కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.16కోట్లు

ఓవర్సీస్ 0.24కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ 5.27కోట్లు (షేర్)నైజాం 1.56కోట్లు

 ఇదిలావుండగా 'జాంబీరెడ్డి' సినిమా ప్రీ రిలీజ్  బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు తెలుస్తోంది. ఇది సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్ల మధ్య జరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
 
ఇక ఈ సినిమా ఫస్టాఫ్ సోసోగా ఉన్నా సెకండాఫ్ భలే ఫన్నీగా ఉంది. ఖచ్చితంగా సినిమా చూస్తూ నవ్వుకుంటారు.  గెట‌ప్ శ్రీను, పృథ్వీ, అన్నపూర్ణమ్మ‌, హేమంత్ ..జాంబీలతో కలిసి తెగ  న‌వ్వించారు. జాంబీలను తీసుకొచ్చి మన తెలుగు ఫ్యాక్షన్ నేపధ్యంలో పెట్టి దానికి మన నేటివిటి అద్దటంతోనే సగం సక్సెస్ అయ్యారు. అలాగే జాంబీలనగానే హారర్ స్క్రీమ్ పెట్టుకోకుండా ఫన్ గా వెళ్లటం మరింత కలిసొచ్చింది.  
 

PREV
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది