Radhe Shyam: 'సంచారి' సాంగ్ టీజర్ వచ్చేసింది

Surya Prakash   | Asianet News
Published : Dec 14, 2021, 01:50 PM IST
Radhe Shyam: 'సంచారి'  సాంగ్ టీజర్ వచ్చేసింది

సారాంశం

సినిమాలో రెండు సాంగ్స్‌(ఈ రాతలే..., నగుమోము తారలే)ను ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడో సాంగ్ 'సంచారి' టీజర్‌ను విడుదల చేశారు.  

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ వీడియోస్, సాంగ్స్ కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాకి ‘జిల్’ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడుతూండటంతో ..చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచారు.  సినిమాలో రెండు సాంగ్స్‌(ఈ రాతలే..., నగుమోము తారలే)ను ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడో సాంగ్ 'సంచారి' టీజర్‌ను విడుదల చేశారు.  16 వ తేదీన పూర్తి పాట రిలీజ్ కానుంది.

సౌత్ లాంగ్వేజ్ సాంగ్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా...  హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. 'సంచారి' పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా... అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. 'చలో... చలో... సంచారి! చల్ చలో... చలో!  చలో... చలో... సంచారి! చల్ చలో... చలో... కొత్త నేలపై' అంటూ పాటను కృష్ణకాంత్ (కెకె) రాశారు. సినిమాలో హీరో ట్రావెలింగ్ చేసే సమయంలో వచ్చే పాటలా అనిపిస్తోంది.

 ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో క్లాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రేక్షకులకు తప్పకుండా మెప్పింస్తుందని ఈ చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

Also read Radhe Shyam: ‘రాధేశ్యామ్‌’...కరోనా కష్టాలు స్టార్ట్?

ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి మ్యూజిక్ డైరెక్టర్ గా జస్టిన్  ప్రభాకరన్ పనిచేస్తున్నారు. ఆయన పాటలు అందిస్తున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు తమన్ ని తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య తమన్ మ్యూజిక్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. బన్నీ హీరోగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకి అందించిన మ్యూజిక్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమా కూడా రొమాంటిక్ గా ఉండే చిత్రం కావటం, అఖండ సూపర్ హిట్ కావటంతో తమన్ ని బెస్ట్ ఛాయిస్ గా భావిస్తున్నారు. దీంతో రాధేశ్యామ్ టీం తమన్‌కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి