Mahesh Babu:బ్రేకింగ్ న్యూస్... విదేశాలలో మహేష్ బాబుకు సర్జరీ!

Published : Dec 14, 2021, 01:45 PM ISTUpdated : Dec 14, 2021, 01:46 PM IST
Mahesh Babu:బ్రేకింగ్ న్యూస్... విదేశాలలో మహేష్ బాబుకు సర్జరీ!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ (Mahesh babu)సర్జరీ చేయించుకున్నారు. ఆయన కాలికి స్పెయిన్ దేశంలో సర్జరీ జరిగినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

కొద్దిరోజల క్రితం సర్కారు వారి పాట మూవీ షూటింగ్ కి మహేష్ బ్రేక్ ప్రకటించారు. గోవా, హైదరాబాద్ షెడ్యూల్స్ అనంతరం ఆయన విరామం తీసుకున్నారు. అదే సమయంలో సర్కారు వారి పాట విడుదల కూడా సమ్మర్ కి వాయిదా వేయడం జరిగింది. మొదట జనవరి 14న సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, అనూహ్యంగా ఏప్రిల్ 1న వస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు. 

సర్కారు వారి పాట (Sarkaru vaari paata)షూటింగ్ కి మహేష్ బ్రేక్ ప్రకటించడానికి ఆరోగ్య సమస్యలే కారణమంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. కొన్నాళ్లుగా మహేష్ మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్నారని, పరిష్కారంగా సర్జరీ చేయాలని డాక్టర్స్ సూచించారని సదరు కథనాల సారాంశం. సర్జరీ అనంతరం మహేష్ రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందట. అందుకే మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ వాయిదా వేశారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. 

కాగా మహేష్ సతీసమేతంగా సడన్ గా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో మహేష్ ఆకస్మిక ప్రయాణం కూడా సర్జరీ  కోసమే అని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలు నిజమే అని సమాచారం అందుతుంది. మహేష్ మోకాలికి స్పెయిన్ దేశంలో సర్జరీ జరిగిందట. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారట. మహేష్ భార్య నమ్రత సిస్టర్ శిల్పా శిరోద్కర్ దుబాయ్ లో నివాసం ఉంటున్నారు. అక్కడే కొన్ని రోజులు మహేష్ విశ్రాంతి తీసుకోనున్నట్లు వినికిడి.

Also readMahesh Babu: మహేష్ ఆకస్మిక ప్రయాణం.. ఫ్యాన్స్ లో ఆందోళన!
ఇక దర్శకుడు పరుశురామ్ సర్కారు వారి పాట చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్థిక నేరాలు నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీ తెరకెక్కుతుంది. పూరి మార్క్ హీరోయిజం మహేష్ లో చూస్తారని దర్శకుడు చెప్పిన నేపథ్యంలో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ కి జంటగా కీర్తి సురేష్ (Keerthy Suresh)నటిస్తుండగా... థమన్ సంగీతం అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Anil Ravipudi నెక్స్ట్ మూవీ ఎవరితో ? వివి వినాయక్ కి కూడా సాధ్యం కాని రేర్ రికార్డ్ కి చేరువలో..
BMW First Review: `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చిందా?