సమంత, అనుష్కపై మనసులో మాట బయటపెట్టిన క్రేజీ బ్యూటీ.. ఆ ముగ్గురు హీరోలంటే..

pratap reddy   | Asianet News
Published : Oct 06, 2021, 03:02 PM ISTUpdated : Oct 06, 2021, 03:04 PM IST
సమంత, అనుష్కపై మనసులో మాట బయటపెట్టిన క్రేజీ బ్యూటీ.. ఆ ముగ్గురు హీరోలంటే..

సారాంశం

నాజూకు అందంతో వెండితెరపై రాశి ఖన్నా గ్లామర్ మెరుపులకు కుర్రాళ్లు ఫిదా అవుతుంటారు. చెక్కిన శిల్పంలా అందంతో ఆకట్టుకునే రాశి ఖన్నా టాలీవుడ్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది.

నాజూకు అందంతో వెండితెరపై రాశి ఖన్నా గ్లామర్ మెరుపులకు కుర్రాళ్లు ఫిదా అవుతుంటారు. చెక్కిన శిల్పంలా అందంతో ఆకట్టుకునే రాశి ఖన్నా టాలీవుడ్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కూడా వరుస ఆఫర్స్ అందుకుంటోంది. 

ఇటీవల Raashi Khanna సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయింది. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు రాశి ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. అభిమానులతో ఇంటరాక్ట్ అయినప్పుడు సహజంగానే మీకు ఇష్టమైన నటులు, నటీమణులు ఎవరు అంటూ ప్రశ్నిస్తారు. రాశి ఖన్నాకి కూడా ఆ ప్రశ్నలు ఎదురయ్యాయి. 

టాలీవుడ్ లో మీకు ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్నించగా.. నాకు అందరూ ఇష్టమే. కాకపోతే మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ అంటే మరింత ఇష్టం అని రాశి చెప్పుకొచ్చింది. వీరిలో రాశి ఖాన్ ఎన్టీఆర్ తో జైలవకుశ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకుంది. అల్లు అర్జున్,మహేష్ బాబుతో ఇంకా నటించలేదు. 

Also Read: నెపోటిజంపై రానా కామెంట్స్.. అది రాజకీయాల్లో చర్చించుకోవాలి

అలాగే తనకు ఇష్టమైన హీరోయిన్ల పేర్లు కూడా రివీల్ చేసింది. తనకు సమంత, అనుష్క శెట్టి అంటే ఇష్టం అని రాశి ఖన్నా మనసులో మాట బయట పెట్టింది. సమంత, అనుష్క నటీమణులుగా సౌత్ మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నారు. 

ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో 'అరణ్మనై3', సర్దార్ చిత్రాల్లో నటిస్తోంది. అరణ్మనై 3లో ఆర్య హీరోగా నటిస్తున్నాడు. ఇక సర్దార్ చిత్రం కార్తీ హీరోగా తెరకెక్కుతోంది. తెలుగులో రాశి ఖన్నా.. నాగ చైతన్యకి జోడిగా 'థ్యాంక్యూ' చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకుడు. అలాగే మారుతి దర్శకత్వంలో గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ మూవీ చేస్తోంది ఈ బ్యూటీ. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు