నెపోటిజంపై రానా కామెంట్స్.. అది రాజకీయాల్లో చర్చించుకోవాలి

By telugu teamFirst Published Oct 6, 2021, 1:35 PM IST
Highlights

ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి నటుడిగా జాతీయ స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలి, ఘాజి చిత్రాలతో రానా ప్రతిభ దేశం మొత్తం వ్యాపించింది. ప్రస్తుతం రానా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. 

ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి నటుడిగా జాతీయ స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలి, ఘాజి చిత్రాలతో రానా ప్రతిభ దేశం మొత్తం వ్యాపించింది. ప్రస్తుతం రానా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. రానా వివాదాలకు దూరంగా ఉండే నటుడు. కానీ ఏదైనా అంశం గురించి తన అభిప్రాయం చెప్పేటప్పుడు సూటిగా వ్యవహరిస్తాడు. 

ఇటీవల రానా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా చిత్ర పరిశ్రమలో నెపోటిజం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువగా ఉంది. నాలుగైదు కుటుంబాలు మాత్రమే టాలీవుడ్ పై ఆధిపత్యం చలాయిస్తున్నాయి అనే ప్రశ్నలకు రానా తనదైన శైలిలో బదులిచ్చాడు. 

నెపోటిజం అనేది రాజకీయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినది. దీని గురించి అక్కడ చర్చించుకోవాలి. కానీ సినిమా రంగంలో నెపోటిజం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా అనేది కళలకు సంబంధించినది. కళ అనేది ఏ కుటుంబం నుంచి వచ్చారు ? బ్యాగ్రౌండ్ ఏంటి అనే దానిపై ఆధారపడి ఉండదు. ప్రతిభ ఉందా లేదా ? దానిని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే దానిపైనే ఇక్కడ ఫలితాలు ఆధారపడతాయి. ప్రతిభని ఎవరూ అడ్డుకోలేరు అని రానా క్లారిటీ ఇచ్చాడు. 

Also Read: 'ఎఫ్ 3' సెట్స్ లో అల్లు అర్జున్ సందడి.. వెంకీ మామ చేతిలో చేయి వేసి, సునీల్ భలే గెటప్ లో ఉన్నాడే!

Rana Daggubati ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం చిత్రంలో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్. ప్రియమణి, నందితా దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

మరోవైపు రానా.. పవన్ కళ్యాణ్ తో కలసి భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రానా పాత్ర పేరు డానియల్ శేఖర్. రానాకు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సాగర్ చంద్ర దర్శకుడు. 

Also Read: షాకింగ్ కామెంట్స్ : ‘సమంతని ఆ హీరో ట్రాప్ చేశాడు’, సొంత సంపాదన ఆమె ఖాతాలోకి వెళ్లటం లేదు

click me!