‘‘ మా ’’ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్: నరేశ్, కరాటే కల్యాణీలపై హేమ సంచలన ఆరోపణలు, ఎన్నికల అధికారికి ఫిర్యాదు

By Siva Kodati  |  First Published Oct 6, 2021, 3:02 PM IST

ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ బుధవారం మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. తనపై కరాటే కల్యాణి (karate kalyani) , నరేశ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని హేమ (hema) ఆరోపించారు. అసభ్య వ్యాఖ్యలతో ఓ వీడియోను విడుదల  చేశారని ఆమె లేఖలో తెలిపారు.


మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లకు (MAA elections) స‌మయం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో రసవత్తరంగా సాగుతోంది. ప్రతిరోజూ మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్స్‌కు చెందిన ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్ధి ప్యానెల్‌పై విమర్శలు చేస్తున్నారు. ఇక నిన్న పోస్టల్ బ్యాలెట్‌లో మంచు విష్ణు కుట్ర చేస్తున్నారంటూ ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి దుమారం లేపారు. ఎన్నికల్లో హామీలతో గెలవాలని, ఇంతలా దిగజారకూడదంటూ ఆయన ప్రెస్‌మీట్‌లోనే కంటతడి పెట్టారు.

దీనికి కౌంటర్‌గా నిన్న మధ్యాహ్నమే.. విష్ణు, నరేశ్‌ (naresh)లు మీడియా ముందుకు వచ్చి ప్రకాశ్ రాజ్‌పై విమర్శలు చేశారు. అయినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ బుధవారం మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. తనపై కరాటే కల్యాణి (karate kalyani) , నరేశ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని హేమ (hema) ఆరోపించారు. అసభ్య వ్యాఖ్యలతో ఓ వీడియోను విడుదల  చేశారని ఆమె లేఖలో తెలిపారు. కళ్యాణి, నరేశ్‌లపై చర్యలు తీసుకోవాలని హేమ విజ్ఞప్తి చేశారు. 

Latest Videos

ALso Read:నా ఫ్యామిలీ పేరు తీస్తే మామూలుగా ఉండదు..ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. ప్రకాష్‌ రాజ్‌కి మంచు విష్ణు వార్నింగ్‌

ఇదిలా ఉంటే నిన్నటి బ్యాలెట్ పేపర్ వివాదంపై మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ (krishna mohan)దీనిపై స్పందించారు. ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోనే జరపాలని manchu vishnu ప్యానెల్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోనే జరుపబోతున్నామని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ తెలిపారు. మంచు విష్ణు, prakash raj రిక్వెస్ట్ లను పరిగణలోకి తీసుకుని, వారి రిక్వెస్ట్ ని `మా` క్రమశిక్షణ కమిటి ఛైర్మన్‌ కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లారని, ఆయన బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు కృష్ణమోహన్‌ తెలిపారు. దీంతో మొత్తంగా మంచు విష్ణు తన పంతం నెగ్గించుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రతి రెండేళ్లకి ఒక సారి `మా` ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీకే నరేష్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. 2021-23కిగానూ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష బరిలో మంచు విష్ణు, ప్రకాష్‌ రాజ్‌ పోటీలో ఉన్నారు. మొదట వీరిద్దరితోపాటు జీవిత రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నర్సింహరావు (cvl narasimha rao) పోటీలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్లు పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్‌ లు మాత్రమే పోటీలో ఉన్నారు. వీరి మధ్య ఆరోపణలు, వార్నింగ్ లు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. అక్టోబర్‌ 10న ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రోజు సాయంత్రం ఏడు గంటల వరకు ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు
 

click me!