Project K: `ప్రాజెక్ట్ కే`లో బోల్డ్ బ్యూటీ దిశా పటానీ.. ప్రభాస్‌ ఫ్యాన్స్ కి గ్లామర్‌ ట్రీట్‌..

Published : May 08, 2022, 06:10 PM IST
Project K: `ప్రాజెక్ట్ కే`లో బోల్డ్ బ్యూటీ దిశా పటానీ.. ప్రభాస్‌ ఫ్యాన్స్ కి గ్లామర్‌ ట్రీట్‌..

సారాంశం

ప్రభాస్‌తో బాలీవుడ్‌ బోల్డ్ బ్యూటీ దిశాపటానీ జోడి కట్టబోతుంది. చాలా గ్యాప్‌ తర్వాత ఆమె తెలుగులోకీ రీఎంట్రీ ఇవ్వబోతుంది. డార్లింగ్‌ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌కి రెడీ అవుతుంది.

బోల్డ్ బ్యూటీ దిశా పటానీ ఎట్టకేలకు తెలుగులోకి కమ్‌ బ్యాక్‌ కాబోతుంది. ఈ అమ్మడు తెలుగులో సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏకంగా ప్రభాస్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్న ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కే` ఒకటి. ఇందులో ప్రభాస్‌కి జోడీగా బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుంది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌నిచ్చింది యూనిట్‌. 

`ప్రాజెక్ట్ కే` లో మరో హీరోయిన్‌కి ఛాన్స్ ఉంది. సెకండ్‌ హీరోయిన్‌గా బోల్డ్ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేశారు. తాజాగా ఈ విషయాన్ని దిశా పటానీ అధికారికంగా వెల్లడించింది. తనకు `ప్రాజెక్ట్ కే` టీమ్‌ నుంచి వచ్చిన లెటర్‌, బోకేని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకుంది దిశా. తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండటం విశేషం. ప్రభాస్‌ కి జోడీగా దీపికా పదుకొనె అందాలతోపాటు దిశా  అందాలు తోడు కాబోతున్నాయని, `ప్రాజెక్ట్ కే`లో గ్లామర్‌ డోస్‌ డబుల్‌ కాబోతుందని భావిస్తున్నారు డార్టింగ్‌ ఫ్యాన్స్. 

సైన్స్ ఫిక్షన్‌గా `ప్రాజెక్ట్ కే`ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెలిపారు. భారీ విజువల్‌ వండర్‌గానూ ఉండబోతుందని చెప్పారు. అయితే ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌ని మించి పాన్‌ వరల్డ్ స్థాయిలో ఉంటుందన్నారు. సుమారు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మాత. ఈ సినిమాపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. 

ఇదిలా ఉంటే దిశా పటానీ `లోఫర్‌` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైన విషయం తెలిసిందే. వరుణ్‌ తేజ్‌హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరీజగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది దిశా పటానీ. సినిమా పరాజయం చెందినా, దిశా పటానీకి మాత్రం మంచి పేరొచ్చింది. కానీ ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగులో సినిమా చేయలేదు. అక్కడ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. చివరగా ఆమె సల్మాన్‌తో `రాధే` చిత్రంలో మెరిసింది. ఇందులో ఆమె అత్యంత బోల్డ్,హాట్‌ రోల్స్ లో నటించి కనువిందు చేసింది. మరోసారి తెలుగు ఆడియెన్స్ కి తన అందాల విందుని వడ్డించబోతుందని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే