సాయిపల్లవి ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేయబోతున్న `విరాటపర్వం` టీమ్‌.. క్రేజీ అప్‌డేట్‌

Published : May 08, 2022, 05:25 PM IST
సాయిపల్లవి ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేయబోతున్న `విరాటపర్వం` టీమ్‌.. క్రేజీ అప్‌డేట్‌

సారాంశం

 `విరాటపర్వం` యూనిట్‌లోనూ జోష్‌ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన వరుస అప్‌డేట్లు ఇస్తున్నారు. రేపు(సోమవారం) మరో సర్‌ప్రైజ్‌ ఈ చిత్రం నుంచి వదలబోతున్నారు. 

సాయిపల్లవి(Sai Pallavi) మరోసారి తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. చివరగా ఆమె `శ్యామ్‌ సింగరాయ్‌`లో మెరవగా ఇప్పుడు `విరాటపర్వం`)VirataParvam)తో రాబోతుంది. రానా హీరోగా నటించిన చిత్రమిది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 1న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్‌. ఇప్పటి వరకు సినిమా రిలీజ్‌ ఎప్పుడనే సస్పెన్స్ నెలకొంది. దాన్ని బ్రేక్‌ చేస్తూ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు మేకర్స్.  

దీంతో `విరాటపర్వం` యూనిట్‌లోనూ జోష్‌ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన వరుస అప్‌డేట్లు ఇస్తున్నారు. రేపు(సోమవారం) మరో సర్‌ప్రైజ్‌ ఈ చిత్రం నుంచి వదల బోతున్నారు. ముఖ్యంగా సాయిపల్లవి ఫ్యాన్స్ ని ఖుషీ చేసే న్యూస్‌ వెల్లడించారు. ఇందులో `సోల్‌ ఆఫ్‌ వెన్నెల` పేరుతో ఓ వీడియోని విడుదల చేయబోతున్నారు. వెన్నెల పాత్రలోని సోల్‌ని ఈ వీడియోలో చూపించబోతున్నారు. ఇంకా చెప్పాలంటే సాయిపల్లవి పాత్రలోని ఆత్మని ఆవిష్కరించబోతున్నారని చెప్పొచ్చు. అయితే `వెన్నెల రెండు సార్లుజన్మించింది` అంటూ దర్శకుడు చేసిన పోస్ట్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అంచనాలను పెంచుతుంది. సోమవారం ఉదయం 11.07గంటలకు `సోల్‌ ఆఫ్‌ వెన్నెల`ని విడుదల చేయబోతున్నారు. 

ఇక ఈ చిత్రంలో వెన్నెల పాత్రలో సాయిపల్లవి కనిపిస్తుండగా, విప్లవ నాయకుడు, నక్సలైట్‌ రవన్న అలియాస్‌ డాక్టర్‌ రవిశంకర్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు వేణు ఉడుగుల.  నక్సల్‌ పోరాటం, విప్లవ భావాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు 1990లో ఎలా ఉండేవి, తమకు, పేద ప్రజలకు జరిగిన అన్యాయాలపై రవన్న చేసిన పోరాటాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, గ్లింప్స్ సినిమాలపై అంచనాలను పెంచాయి. ఇందులో ప్రియమణి, నివేతా పేతురాజ్‌, నవీన్‌ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా