ఐదు గోల్డ్ మెడల్స్ సాధించిన హీరో మాధవన్ కొడుకు.. సూర్య, అనుష్క శర్మ ప్రశంసలు..

Published : Apr 17, 2023, 02:42 PM IST
ఐదు గోల్డ్ మెడల్స్ సాధించిన హీరో మాధవన్ కొడుకు.. సూర్య, అనుష్క శర్మ ప్రశంసలు..

సారాంశం

ప్రముఖ స్టార్ హీరో మాధవన్ కొడుకు ఏకంగా భారత్ కు ఐదు గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు. స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో పతకాలతో  అదరగొట్టాడు. దీంతో మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు.   

స్టార్‌ హీరో మాధవన్‌ (Madhavan) పుత్రోత్సాహంలో మునిగి తేలుతున్నారు. వేదాంత్ మాధవన్ (Vedaant Madhavan) క్రీడారంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది వేదాంత్‌ ఖేలో ఇండియా గేమ్స్‌-2023లో రికార్డు స్థాయిలో పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అప్పుడు మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించిన వేదాంత్‌ మాధవన్ 5 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలతో సహా మొత్తం 7 పతకాలను గెలుచుకున్నారు. తాజాగా మరోసారి అంతర్జాతీయ స్థాయిలోని స్విమ్మింగ్ పోటీల్లో పతకాలతో అదరగొట్టారు. 

రీసెంట్ గా ‘మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్ షిప్స్’లో వేదాంత్ పాల్గొన్నారు. ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ (50మీ, 100మీ, 200మీ, 400మీ, 1500మీ) లో ఐదు గోల్డ్ మెడల్స్ ను సాధించారు. దీంతో మాధవన్ సంతోషం వ్యక్తం చేశారు. కొడుకు వేదాంత్ ను అభినందిస్తూ స్పెషల్ నోట్ ను కూడా పంచుకున్నారు.  ‘దేవుడి దయ, మీ ఆశీస్సులతో వేదాంత్ గెలిచాడు. మలేషియా కౌలాలంపూర్ లో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో భారత్ కు ఐదు స్వర్ణాలు అందించాడు. చాలా గర్వంగా ఉంది. అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

మరోవైపు స్టార్స్ కూడా వేదాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మాధవన్ పోస్ట్ పై అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ, ‘అద్భుతం. అభినందనలు వేదాంత్!’ అని ప్రశంసించారు.  అనుష్క  శర్మ (Anushka Sharma) కూడా ‘అందరికీ శుభాకాంక్షలు’ అని తెలిపారు.  ఇక తమిళ స్టార్ సూర్య స్పందిస్తూ.. ‘వేదాంత్, సరిత, మీ బృందానికి హృదయపూర్వక అభినందనలు’ అంటూ కామెంట్ సెషన్ లో రాసుకొచ్చారు.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఎమోషనల్ , మనసు నిండిపోయింది, ప్రేమ మరువలేనంటూ మెగాస్టార్ కృతజ్ఞతలు.. ఎవరికో తెలుసా?
తారక్‌కు ఒక స్టోరీ చెప్పాను.. కానీ.! ఆ రోజు అలా జరగకపోయి ఉంటే..