సమంతది ముసలి ముఖం, శాకుంతలం ఎలా చేసింది? షాకింగ్ కామెంట్స్!

Published : Apr 17, 2023, 11:54 AM IST
 సమంతది ముసలి ముఖం, శాకుంతలం ఎలా చేసింది?  షాకింగ్ కామెంట్స్!

సారాంశం

 ఒకప్పుడు ఆమె చాలా అద్భుతమైన సౌందర్యరాశి కానీ అనేక రకాల జబ్బుల బారిన పడి ఆమెకు ముసలి ముఖం వచ్చేసిందని చిట్టిబాబు పేర్కొన్నారు.


సమంతను ఇక మీద హీరోయిన్ గా తీసుకునే అవకాశం లేదని ఎందుకంటే ఆమెకు ముసలి మొఖం వచ్చేసిందని నిర్మాత,నటుడు చిట్టిబాబు అనటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అలాంటి ఫేస్ తో శాకుంతలం సినిమా ఎలా చేసిందో చూడాలని సినిమా ఎలా ఉంటుందో తాను కూడా చూడాలనుకుంటున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.  కెమెరామెన్ ఏదైనా జిమ్మిక్కు చేస్తే తప్ప ఆ ముసలి ముఖాన్ని దాయడం కష్టమని ఆయన అన్నారు. ఒకప్పుడు ఆమె చాలా అద్భుతమైన సౌందర్యరాశి కానీ అనేక రకాల జబ్బుల బారిన పడి ఆమెకు ముసలి ముఖం వచ్చేసిందని చిట్టిబాబు పేర్కొన్నారు.

 సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం  ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్‌ ఏడేళ్లు గ్యాప్‌ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. మొదటి నుంచి వరుస ప్రమోషన్లు, ప్రీమియర్‌ షోలు వేస్తూ వచ్చిన చిత్ర టీమ్  ఈ సినిమాపై జనాల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్‌ చేశారు. అయితే ప్రీమియర్స్‌ నుంచి ఈ సినిమాకు కాస్త మిక్స్డ్‌ టాక్‌ రావడం మొదలైంది. సినిమా రిలీజ్‌ తర్వాత కూడా అదే టాక్‌ తెచ్చుకుని బాక్సాఫీస్‌ దగ్గర ఘోర పరాజయం పాలైంది. ఈ నేపధ్యంలో మీడియాతో సమంతపై చిట్టిబాబు కామెంట్ చేయటం అంతటా చర్చనీయాంశంగా మారింది.

సమంత...ఇప్పుడున్న మొహం... శాకుంతలం సినిమాకి ఏమాత్రం సూట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే శాకుంతలం సినిమా ఆమెకు మయోసైటీస్ రాకముందే చేయడం మొదలు పెట్టారు కదా అంటే అయితే అప్పటికే ఆమె టాప్ హీరోయిన్ల రేసు నుంచి తప్పుకుందని చిట్టిబాబు చెప్పుకొచ్చారు. అలా పడిపోవడం వల్ల ఊ అంటావా ఊహూ అంటావా, అనే ఒక హాఫ్ న్యూడ్ సాంగ్ చేసిందంటూ చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత అనారోగ్యం వల్ల ముఖం పీక్కుపోయిందని అందుకనే ఏదేదో చేస్తుందని, తాను చనిపోయే లోపు ఇలాంటి పాత్రలు చేయాలని భావిస్తున్నాను అంటూ రకరకాల సినిమాలు సెట్ చేసుకుంటుందని ఆయన ఆరోపించారు. 

ఇక ఆ అమ్మాయి, ప్రతి సినిమా ముందు ఇలాంటి సెంటిమెంటల్ డ్రామాలు క్రియేట్ చేస్తూ వస్తోందని యశోద సినిమా సమయంలో కూడా డబ్బింగ్ చెబుతున్నట్లుగా ఉన్న ఫోటో రిలీజ్ చేసిందని నిజానికి ఒకప్పుడు హై ఫీవర్ తో ఉండి నటించిన వారు కూడా ఎంతోమంది ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. హీరోయిన్ గా ఆమె కెరీర్ అయిపోయిందని ఈ సందర్భంగా చిట్టిబాబు పేర్కొన్నారు. కెరీర్ అయిపోయింది కాబట్టే ఇప్పుడు తాను చేసిన సినిమాలను ఏదో ఒక సెంటిమెంట్ ప్లే చేసి హిట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దృశ్య కావ్యం అవుతుందో అ దృశ్య కావ్యం అవుతుందో చూడాలంటూ చమత్కరించారు. 
 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్