మై బ్రదర్ నాని అంటూ.. ‘దసరా’ టీమ్ పై బన్నీ ప్రశంసలు.. ఐకాన్ స్టార్ అదిరిపోయే రివ్యూ..

By Asianet News  |  First Published Apr 17, 2023, 1:52 PM IST

‘దసరా’ చిత్ర యూనిట్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సినిమాపై సూపర్ రివ్యూ కూడా అందించారు. నానిని పెర్పామెన్స్ ను అభినందించారు. 
 


నేచురల్ స్టార్ నాని (Nani) - కీర్తి  సురేష్ జంటగా  ప్రేక్షకుల ముందుకు వచ్చిన రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ Dasara. మార్చి 30న పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదలైంది. అటు ఓవర్సీస్ లోనూ విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది.  తొలిరోజే సినిమా బ్లాక్ బాస్టర్  టాక్ ను సొంతం చేసుకుంది. రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టింది. ఓవర్సీస్ లోనూ 2 మిలిన్ల డాలర్స్ ను సాధించింది నాని మరో రికార్డును క్రియేట్ చేశారు.  

అయితే చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడంతో పాటు సినీ తారలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ ను అభినందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. చిత్ర యూనిట్ శ్రమను ప్రశంచారు బన్నీ. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘దసరా టీమ్ మొత్తానికి నా అభినందనలు. బ్రిలియంట్ గా తీసిన సినిమా. మై బ్రదర్ నాని అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. కీర్తి సురేష్ కూడా అదరగొట్టింది.

Latest Videos

సంతోష్ నారాయణ్ అద్భుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సత్యన్ అద్భుతమైన కెమెరా వర్క్ అందించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అరంగేట్రం అదిరిపోయింది. ఈసందర్భంగా నిర్మాతలు, సినిమాలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. వేసవిలో నిజమైన దసరా..’ అంటూ ట్వీట్ లో వెల్లడించారు. ప్రస్తుతం బన్నీ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సింగరేణి కోల్ మైన్ పరిసర ప్రాంతంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ దక్కింది. మే 30న నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప : ది రూల్’ (Pushpa The Rule)లో నటిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, స్పెషల్ వీడియోకు ఇంటర్నెట్ షేక్ అవుతున్నవిషయం తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయిక. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

 

Big Congratulations to the entire team of . Brilliantly made film . Finest performance my brother . Candid performances by and all the other cast . Wonderful songs & B.Score by garu & excellent camera work by Sathyan garu . The…

— Allu Arjun (@alluarjun)
click me!