‘పుష్ఫకవిమానం’ కలెక్షన్స్: ఇక్కడ ఒకలా...ఓవర్ సీస్ లో మరోలా

Surya Prakash   | Asianet News
Published : Nov 16, 2021, 12:17 PM IST
‘పుష్ఫకవిమానం’ కలెక్షన్స్: ఇక్కడ ఒకలా...ఓవర్ సీస్ లో మరోలా

సారాంశం

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ఫకవిమానం’. దామోదర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. ఇందులో ఆనంద్ కు జంటగా శాన్వి మేఘన నటించింది. గీతా సైని, నరేష్ ప్రధాన పాత్రలు పోషించారు.

దొరసాని సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత  మిడిల్ క్లాస్​ మెలొడీస్​తో టాలీవుడ్​లో మంచి హిట్​ కొట్టాడు విజయ్​ దేవరకొండ తమ్ముడు ఆనంద్​ దేవరకొండ. ఇప్పుడు పుష్పక విమానంతో మరోసారి థియేటర్లలో  పలకరించారు. కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు దర్శకత్వం వహించారు.  ఇందులో ఆనందర్​ సరసన న్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లుగా నటించారు.పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికరమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే ఓవర్ సీస్ లో డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసిందని సమాచారం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..పుష్పకవిమానం చిత్రం యుఎస్ లో ఫస్ట్ వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. అక్కడ ఈ సినిమా $80k (66 లక్షల గ్రాస్) ఫస్ట్ వీకెండ్ లో సాధించింది. అక్కడ  ఈ చిత్రం తీసుకున్న రేటుకు ఈ కలెక్షన్స్ బాగా వర్కవుట్ అయ్యినట్లే అని చెప్తున్నారు. ఆస్ట్రేలియాలో  16k డాలర్లు వసూలు చేసింది. ఏదైమైనా అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది. 

Also read ఫ్యాన్స్ డిమాండ్ కి తలొగ్గిన పవన్... సంక్రాంతికే భీమ్లా నాయక్

ఇక ఈ చిత్రం రిలీజ్ కు ముందే  విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్​ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. కాగా, ఇటువంటి భారీ అంచనాల మధ్య శుక్రవారం(నవంబరు12) న సినిమా విడుదలైంది.  చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) మీనాక్షి (గీత్ సైని)ని వివాహం చేసుకుంటాడు. అయితే పెళ్లయిన రెండో రోజే మీనాక్షి వేరొకరితో పారిపోతుంది. ఊహించని ఈ విచిత్ర పరిస్థితిని సుందర్ ఎలా ఎదుర్కొంటాడు. అసలు మీనాక్షి ఎందుకు పారిపోయింది అనేది చిత్ర కథాంశం? సుందర్ తన భార్య ఎక్కడికి వెళ్లింది.. ఎవరితో వెళ్లింది తెలుసుకున్నాడా ? అనే కీలకమైన ట్విస్ట్​తో తొలి భాగం పూర్తవగా.. రెండో భాగంలో ట్వస్ట్​లతో కథను ముందుకు తీసుకెళ్లారు. దర్శకుడు దామోదర్ సిట్యుయేషనల్ కామెడీని బాగా పండించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలన్నీ సందర్భానుసారంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.

Also read ‘పుష్ప’ రిలీజ్ సమస్య, బన్ని స్వయంగా సీన్ లోకి వచ్చేకే సాల్వ్ !

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 12: రాత్రయినా ఇంటికి రాని వల్లీ భర్త , వేదవతిని రెచ్చగొట్టిన నర్మద
Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన