‘పుష్పక విమానం’ హిందీ రీమేక్..హీరో ఎవరంటే...!?

By Surya PrakashFirst Published Nov 17, 2021, 7:19 PM IST
Highlights

  విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్, ‘టాంగా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రం రిలీజైంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చింది. 

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించిన చిత్రం పుష్పక విమానం (Pushpaka Vimanam).  కథ మీద ఉన్న నమ్మకంతో ప్రముఖ హీరో, ఆనంద్‌ అన్నయ్య విజయ్‌ దేవరకొండ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్‌లోనూ భాగమయ్యారు విజయ్‌.  విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్, ‘టాంగా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రం రిలీజైంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రీమేక్ రైట్స్ కు డిమాండ్ వచ్చిందని సమాచారం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. బాలీవుడ్ నుంచి మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు "పుష్పక విమానం" రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు. కొత్త తరహా కథలో కామెడీ, మిస్టరీ కలిసి ఉండటం "పుష్పక విమానం" ను యూనిక్ మూవీగా మార్చటం కలిసి వచ్చిందంటున్నారు. సినిమాలోని ఈ క్వాలిటీనే బాలీవుడ్ మేకర్స్ ను రీమేక్ కు పోటీ పడేలా చేస్తున్నాయన్నారు.

ప్రస్తుతం థియేటర్లలో స్టడీ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళ్తోంది "పుష్పక విమానం". యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. "పుష్పక విమానం" బాలీవుడ్ రీమేక్ గురించి ఈ మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ సంస్థల వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తాం అని అనురాగ్ పర్వతనేని తెలిపారు. రాజకుమార్ రావు, విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా వీరి ముగ్గురులో ఎవరో ఒకరు ఈ సినిమా చేసే అవకాసం ఉంది.

ఓ  అమాయక యువకుడు పెళ్లి, అతని జీవితం, ఓ మర్డర్‌ మిస్టరీ చుట్టూ తిరిగే చిన్న ఫన్నీ కథ ఇది. సుందర్‌, మీనాక్షి పెళ్లితోనే సినిమా మొదలవుతుంది. పెళ్లైన కొద్దిరోజులకే భార్య వెళ్లిపోవడం, ఆమె ఇంట్లో లేకపోయినా ఉందని నమ్మించేందుకు సుందర్‌ చేసిన పనులు, పడ్డ ఇబ్బందులు హాస్యాన్ని పండించాయి.తర్వాత కథ మర్డర్ మిస్టరీగా మారి ఎంటర్టైన్ చేస్తుంది.

also read: ఫుల్ ఫన్ ట్రైలర్: "అనుభవించు రాజా" కు 'బంగార్రాజు' భరోసా

click me!