ఫుల్ రొమాంటిక్ మూడ్ లో అల్లు అర్జున్... ఈ రోజు అంత స్పెషల్ మరి!

Published : Mar 06, 2023, 03:08 PM ISTUpdated : Mar 06, 2023, 03:18 PM IST
ఫుల్ రొమాంటిక్ మూడ్ లో అల్లు అర్జున్... ఈ రోజు అంత స్పెషల్ మరి!

సారాంశం

అల్లు అర్జున్ ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. భార్య స్నేహారెడ్డితో ఉన్న రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.   


టాలీవుడ్ లవ్లీ కపుల్ గా ఉన్నారు అల్లు అర్జున్-స్నేహారెడ్డి. ఈ జంట ఒక్కటై 12 ఏళ్ళు అవుతుంది. 2011 మార్చి 6న అల్లు అర్జున్-స్నేహారెడ్డి వేద మంత్రాల సాక్షిగా ఏడడుగులు వేశారు. ప్రేయసి స్నేహారెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసి అర్థాంగిని చేసుకున్నారు. నేడు పెళ్లి రోజు కాగా భార్యకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. 'హ్యాపీ యానివర్సరీ క్యూటీ' అంటూ కామెంట్ పెట్టారు. అలాగే స్నేహారెడ్డిని కౌగిలిలో బంధించిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. స్నేహారెడ్డి సైతం ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో భర్తకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు కూతురు ఉన్నారు. అబ్బాయి పేరు అయాన్ కాగా, అమ్మాయి పేరు అర్హ. అల్లు అర్జున్ కి పిల్లలంటే ప్రాణం. ఖాళీ సమయంలో వారిద్దరితో గడపడానికి చాలా ఇష్టపడతాడు. అర్హ అప్పుడే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంలో అర్హ బాల భరతుడు రోల్ చేస్తున్నారు. 

స్నేహారెడ్డి-అల్లు అర్జున్ అన్యోన్య దంపతులుగా మెలుగుతూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. అల్లు అర్జున్ భార్యగానే కాకుండా స్నేహారెడ్డి సోషల్ మీడియాలో సపరేట్ అభిమానులను ఏర్పాటు చేసుకున్నారు. స్నేహారెడ్డిని ఇంస్టాగ్రామ్ లో 8 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని అందం స్నేహారెడ్డి సొంతం. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంటారు. 

ఇక అల్లు అర్జున్ కష్టపడి ఐకాన్ స్టార్ గా ఎదిగారు. ఆయనిప్పుడు పాన్ ఇండియా హీరో. పుష్ప మూవీతో ఆయన ఇమేజ్ దేశవ్యాప్తమైంది. ఇటీవల పుష్ప 2 రెగ్యులర్ షూట్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay: తాగి బహిరంగ సభలకు విజయ్‌, ఇచ్చిపడేసిన నటుడు, దళపతి నిజ స్వరూపం ఇదే
Meera Vasudevan: కొన్ని తప్పులు చేశా, మూడు సార్లు విడాకులపై గోల్‌ మాల్‌ నటి బోల్డ్ కామెంట్స్